అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ మిస్టరీ వీడింది. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా భవ్యశ్రీ ఆచూకీ పోలీసులకు లభ్యమైంది తూర్పు గోదావరి జిల్లాలో భవ్యశ్రీ ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. అయితే భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైనట్టు పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే భవ్యశ్రీ కుటుంబ సభ్యులు సాక్షికి వివరాలను అందించారు. కొద్దిసేపట్లో మీడియా సమావేశం ద్వారా అధికారికంగా వెల్లడించనున్నారు. గురువారం ఉదయం షేరింగ్ ఆటోలో తాను పనిచేసే కంపెనీకి భవ్యశ్రీ బయలుదేరి వెళ్లిందని ఆమె తల్లితండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ క్యాబ్ మిస్సవ్వడంతో భవ్యశ్రీ ఆటో ఎక్కింది. నిన్న ఆఫీసుకు రాలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే భవ్యశ్రీ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నట్టు తెలుస్తోంది.