Bhavya sri
-
కాలేజీ భవనం నుంచి దూకిన విద్యార్థిని
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న భవ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి కథనం ప్రకారం.. కదిరి పట్టణానికి చెందిన జ్యోతి, సాంబశివుడు దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉండటంతో భవ్యశ్రీ స్థానిక అంబార్ వీధిలో అమ్మమ్మ వద్ద ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఒంటరినైపోయానన్న ఆవేదన కొద్దిరోజులుగా భవ్యశ్రీలో నాటుకుపోయింది. మరోవైపు ఫీజుల విషయమై కళాశాల యాజ మాన్యం భవ్యశ్రీని మందలించినట్లు తెలిసింది. ఫీజు డబ్బు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆ విద్యార్థిని కళాశాల భవనంపైకి చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆమెను ఎవరూ గుర్తించలేదు. మధ్యాహ్నం 12.30 గంటలకు భవనంపై నుంచి కిందకు దూకింది. అది చూసిన విద్యార్థులు హుటాహుటిన 108 వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘం నేత ఆకుల రాఘవేంద్రతో పాటు పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
జననం
అనిల్, భవ్యశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జననం’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘మాగ్నెట్’ మూవీ డైరెక్టర్ ఆదిశేష సాయిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు లారెన్స్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘డైరెక్టర్ శ్రీనివాస్‌తో గత మూడేళ్లుగా నాకు పరిచయం ఉంది. మంచి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నేను హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్. భవ్యశ్రీ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
భవ్యశ్రీ కథ సుఖాంతం!
హైదరాబాద్: హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె వైజాగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు ప్రత్యేక బృందాలు భవ్యశ్రీని హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రిలీఫ్ కోసమే తాను విశాఖ వెళ్లినట్లు భవ్యశ్రీ చెప్పారు. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఈ నెల 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆమె క్యాబ్‌లో డ్యూటీకి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు విశాఖలో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు. -
పాడేరులో భవ్యశ్రీ సెల్‌ఫోన్ సిగ్నల్!
విశాఖ : మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా పాడేరు గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పాడేరు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న సైబరాబాద్ పోలీసులకు...రూమ్‌లో టీవీ ఆన్‌లో ఉన్నా ఆమె మాత్రం కనిపించలేదు. అయితే మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. భవ్యశ్రీ మిస్సింగ్‌పై మీడియాలో కవరేజ్ విస్తృతంగా ఉండటంతో...ఆమె ఎప్పటికప్పుడు సమచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడ్డారు. అయితే భవ్యశ్రీ కేసు పురోగతి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు కూడా అనుమానించారు. మరోవైపు మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. -
పాడేరులో భవ్యశ్రీ సెల్‌ఫోన్ సిగ్నల్!
-
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ ఆచూకి లభ్యం?
-
భవ్యశ్రీ 'అదృశ్య' మిస్టరీ వీడింది?
హైదరాబాద్: అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ మిస్టరీ వీడినట్టు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా భవ్యశ్రీ ఆచూకీ పోలీసులకు లభ్యమైనట్టు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో భవ్యశ్రీ ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. అయితే భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైనట్టు పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే భవ్యశ్రీ కుటుంబ సభ్యులు సాక్షికి వివరాలను అందించారు. కొద్దిసేపట్లో మీడియా సమావేశం ద్వారా అధికారికంగా వెల్లడిస్తామని కుటుంబ సభ్యులు అందించిన సమాచారం. గురువారం ఉదయం షేరింగ్ ఆటోలో తాను పనిచేసే కంపెనీకి భవ్యశ్రీ బయలుదేరి వెళ్లిందని ఆమె తల్లితండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ క్యాబ్ మిస్సవ్వడంతో భవ్యశ్రీ ఆటో ఎక్కింది. నిన్న ఆఫీసుకు రాలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే భవ్యశ్రీ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నట్టు తెలుస్తోంది. -
భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు
హైదరాబాద్ : సాప్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. భవ్యశ్రీ, ఆమె భర్త కార్తీక్ చైతన్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని డీసీపీ తెలిపారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ గురువారం ఉదయం ఆఫీస్‌కు క్యాబ్‌లో వెళ్తున్నట్లు భర్త సెల్ఫోన్లో మెసేజ్ పెట్టింది. అనంతరం ఆమె ఆచూకీ తెలియకపోవటంతో కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు క్యాబ్ డ్రైవర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.