
భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు
సాప్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్ : సాప్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. భవ్యశ్రీ, ఆమె భర్త కార్తీక్ చైతన్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని డీసీపీ తెలిపారు.
కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ గురువారం ఉదయం ఆఫీస్కు క్యాబ్లో వెళ్తున్నట్లు భర్త సెల్ఫోన్లో మెసేజ్ పెట్టింది. అనంతరం ఆమె ఆచూకీ తెలియకపోవటంతో కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు క్యాబ్ డ్రైవర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.