సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య | Software Employee Killed In Kukatpally | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

Published Fri, Aug 30 2019 8:21 AM | Last Updated on Fri, Aug 30 2019 9:33 AM

Software Employee Killed In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి కెపీహెచ్‌బీ కాలనీలో సతీశ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేట్‌లో నివాసం ఉంటున్న సతీశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతడు కేపీహెచ్‌బీ కాలనీలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సతీశ్‌ ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సతీశ్‌ స్వస్థలం ప్రకాశం జిల్లా మార్టురు కాగా.. ఉద్యోగరీత్యా నగరంలో ఉంటున్నాడు.

కాగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సతీశ్‌తో పాటు భాగస్వామిగా ఉన్న అతడి స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రెండు రోజుల క్రితం సతీశ్‌ అదృశ్యమయ్యాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా సతీశ్‌ స్నేహితుడిపైనే తనకు అనుమానం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన సమాచారం మేరకు స్నేహితుడి గదికి వెళ్లి చూడగా సతీశ్‌ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాపారలావాదేవీలే సతీశ్‌ హత్యకు దారి తీసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement