techie missing
-
బెజవాడలో సాప్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
విజయవాడ: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం కావడంతో అతని కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం ప్రసాదంపాడుకు చెందిన సంతోష్‌కుమార్ సోదరుడు నాగసాయి (25) హైదరాబాద్‌లోని సీజీఐ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఈ నెల ఆరో తేదీన విజయవాడ వచ్చాడు. శనివారం రాత్రి ఏడు గంటలకు బైక్‌పై బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి తన అన్న వాట్సప్‌కు తాను ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకి చనిపోతున్నానని, తన శరీరం కృష్ణానదిలోంచి తీసుకోవాలంటూ మెసేజ్ పంపాడు. దీంతో తమ్ముడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. కాగా నాగసాయి పని ఒత్తిడికి గురి అవుతున్నాడని, అందుకే ప్రశాంతత కోసం తిరుపతి కూడా వెళ్లి వచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు నాగసాయి ఫేస్బుక్ లైవ్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానా లేక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాడేరులో భవ్యశ్రీ సెల్‌ఫోన్ సిగ్నల్!
విశాఖ : మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా పాడేరు గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పాడేరు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న సైబరాబాద్ పోలీసులకు...రూమ్‌లో టీవీ ఆన్‌లో ఉన్నా ఆమె మాత్రం కనిపించలేదు. అయితే మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. భవ్యశ్రీ మిస్సింగ్‌పై మీడియాలో కవరేజ్ విస్తృతంగా ఉండటంతో...ఆమె ఎప్పటికప్పుడు సమచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడ్డారు. అయితే భవ్యశ్రీ కేసు పురోగతి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు కూడా అనుమానించారు. మరోవైపు మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. -
భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు
హైదరాబాద్ : సాప్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. భవ్యశ్రీ, ఆమె భర్త కార్తీక్ చైతన్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని డీసీపీ తెలిపారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ గురువారం ఉదయం ఆఫీస్‌కు క్యాబ్‌లో వెళ్తున్నట్లు భర్త సెల్ఫోన్లో మెసేజ్ పెట్టింది. అనంతరం ఆమె ఆచూకీ తెలియకపోవటంతో కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు క్యాబ్ డ్రైవర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. -
మహిళా సాప్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం
-
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం
కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం అయ్యారు. గురువారం ఉదయం ఆమె క్యాబ్‌లో డ్యూటీకి బయల్దేరారు. క్యాబ్‌లో వెళ్తున్నట్లుగా భర్తకు సెల్ఫోన్లో మెసేజ్ కూడా పెట్టారు. అయితే ఇంతవరకు ఆమె మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. దాంతో తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన భవ్యశ్రీ చరిత, కార్తీక్ సుమారు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఏడో ఫేజ్‌లో నివాసం ఉంటారు. గురువారం ఉదయం 9 గంటలకు తాను క్యాబ్‌లో ఆఫీసుకు బయల్దేరినట్లు ఆమె భర్తకు మెసేజ్ పెట్టింది. సుమారు గంట తర్వాత కార్తీక్ ఫోన్ చేయగా, ఆమె ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆఫీసులో బిజీగా ఉందనుకుని ఊరుకుని మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం ట్రై చేసినా ఫలితం లేదు. దాంతో ఆఫీసుకు వెళ్లి అడిగితే.. అక్కడివాళ్లు ఆమె రాలేదని చెప్పారు. స్థానికులను అడిగితే.. వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. కానీ పోలీసుల విచారణలో మాత్రం భవ్యశ్రీ చరిత గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కావట్లేదని తెలిసింది. దాంతో ఆమె తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూకట్పల్లి పోలీసులు విచారణ సాగిస్తున్నారు.