సాక్షి, శ్రీనగర్ : ఉగ్రమూకలకు, భద్రతాబలగాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుడ్వాని ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన బలగాలు తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో రెచ్చిపోయిన ఉగ్రమూక సైనికులపై కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ మొజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఓ ఏకే 47, ఇన్సాస్ రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు.