కాశ్మీర్లో కాల్పులు : తీవ్రవాది మృతి
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని కల్హార్ ప్రాంతంలో తీవ్రవాదులు... భద్రత దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాది మృతి చెందాడని పోలీసులు చెప్పారు.
అతడి మృతదేహం వద్ద నుంచి ఏకే 47 రైఫిల్తోపాటు మూడు ఏకే మేగజీనులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో భద్రత దళాలకు చెందిన వారికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.