
ప్రతీకాత్మక చిత్రం
జమ్మూకశ్మీర్: భద్రతాబలగాల కాల్పుల్లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన బుద్గాం జిల్లాలోని అరిజాల్ గ్రామంలో చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని దూరు ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మృతిచెందిన సంగతి తెల్సిందే. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ ఆదివారం వరకు కొనసాగింది. ఎలాంటి నష్టం జరగకుండా ఉగ్రవాదుల ఏరివేత ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment