moreh
-
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. మోరె జిల్లాలో బుధవారం నాడు అల్లరిమూక దాదాపుగా 30 ఇళ్లు, దుకాణాలు తగులబెట్టింది. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అల్లరి మూకను అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయో వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. కంగ్పోక్పి జిల్లాలో భద్రతా దళాలను తరలించడానికి ఉంచిన బస్సులకి కూడా దుండగులు నిప్పు పెట్టినట్టుగా అధికారులు తెలిపారు. సపోర్మినాలో మణిపూర్ రిజి్రస్టేసన్ కలిగిన బస్సుల్ని స్థానికులు ఆపేసి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారని తనిఖీ చేశారు. ఆ తర్వాత కొందరు ఆ బస్సుల్ని తగులబెట్టారు. మరోవైపు హింసాకాండలో ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న వారి కోసం తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని ముఖ్యమంత్రి ఎన్. బైరన్ సింగ్ చెప్పారు. ఇంఫాల్‌లోని సజీవా, తౌబల్ జిల్లాలోని యతిబి లౌకోల్‌లో ఇళ్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే సహాయ శిబిరంలో ఉన్న వారందరినీ ఈ ఇళ్లకు తరలిస్తామని బైరన్ సింగ్ ట్వీట్ చేశారు. -
దంపతులపై కాల్పులు.. భర్త మృతి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ సరిహద్దు ప్రాంతం మొరె పట్టణంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధర్మేంద్ర(35) మృతి చెందగా.. అతడి భార్య దేవి(32) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. దుండగులు ధర్మేంద్రపై రెండు రౌడ్ల కాల్పులు జరపగా.. దేవిపై అతిసమీపంలో నుంచి ఒకరౌండ్ కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని మొరె జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ధర్మేంద్ర మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా మొరెలో వ్యాపారకార్యకలాపాలు నిలిపివేయాలని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.