ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ సరిహద్దు ప్రాంతం మొరె పట్టణంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధర్మేంద్ర(35) మృతి చెందగా.. అతడి భార్య దేవి(32) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.
దుండగులు ధర్మేంద్రపై రెండు రౌడ్ల కాల్పులు జరపగా.. దేవిపై అతిసమీపంలో నుంచి ఒకరౌండ్ కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని మొరె జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ధర్మేంద్ర మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా మొరెలో వ్యాపారకార్యకలాపాలు నిలిపివేయాలని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దంపతులపై కాల్పులు.. భర్త మృతి
Published Sun, Oct 30 2016 4:59 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement