myanmar border
-
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!
ఇంఫాల్: మణిపూర్-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్. బైరెన్ సింగ్ సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అత్యంత అవసరం.. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం గురించి కేంద్రాన్ని కోరగా 60 కి.మీ. వరకు కంచెను వేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సీఎం బైరెన్ సింగ్. ఆదివారం సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర హోంశాఖతోనూ జరిగిన చర్చల్లో ఈ కంచెను నిర్మించే విషయమై ఒక నిర్ణయానికి వచ్చామని అక్రమ చొరబాట్ల తోపాటు మాదకద్రవ్యాల రవాణా కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో 70 కి.మీ. మేర కంచె నిర్మాణం ఇప్పుడు అత్యంత ఆవసరమని తెలిపారు. స్వేచ్చాయుత రాకపోకలు.. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని అత్యధికులు అభిప్రాయపడుతున్న కారణంగా ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం. స్వేచ్చాయుత రాకపోకల నిబంధన ప్రకారం ఇటు వారు అటువైపు గానీ అటు వారు ఇటువైపు గానీ 16 కిలోమీటర్లు వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. తప్పనిసరి.. మయన్మార్ దేశం భారతదేశం సరిహద్దులో 1600 కి.మీ. సరిహద్దును పంచుకుంటుండగా అందులో మణిపూర్‌లోని ఐదు జిల్లాలు మయన్మార్‌తో మొత్తంగా 390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చు తోపాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేనికారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమైతే ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే మొదటి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం ఆవసరమని నిర్ణయించారు. Held a meeting with the officials of BRO and deliberated the plan to begin construction of an additional 70 km of border fencing along the Indo-Myanmar border. I was joined by Chief Secretary, DGP & officials from the Home Department. In view of the rise in illegal immigration… pic.twitter.com/cZWO00k3as — N.Biren Singh (@NBirenSingh) September 24, 2023 ఇది కూడా చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! -
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. మోరె జిల్లాలో బుధవారం నాడు అల్లరిమూక దాదాపుగా 30 ఇళ్లు, దుకాణాలు తగులబెట్టింది. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అల్లరి మూకను అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయో వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. కంగ్పోక్పి జిల్లాలో భద్రతా దళాలను తరలించడానికి ఉంచిన బస్సులకి కూడా దుండగులు నిప్పు పెట్టినట్టుగా అధికారులు తెలిపారు. సపోర్మినాలో మణిపూర్ రిజి్రస్టేసన్ కలిగిన బస్సుల్ని స్థానికులు ఆపేసి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారని తనిఖీ చేశారు. ఆ తర్వాత కొందరు ఆ బస్సుల్ని తగులబెట్టారు. మరోవైపు హింసాకాండలో ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న వారి కోసం తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని ముఖ్యమంత్రి ఎన్. బైరన్ సింగ్ చెప్పారు. ఇంఫాల్‌లోని సజీవా, తౌబల్ జిల్లాలోని యతిబి లౌకోల్‌లో ఇళ్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే సహాయ శిబిరంలో ఉన్న వారందరినీ ఈ ఇళ్లకు తరలిస్తామని బైరన్ సింగ్ ట్వీట్ చేశారు. -
Viral Video: ‘మయన్మార్‌లో తింటే.. భారత్‌లో పడుకుంటారు’
నాగాలాండ్ మంత్రి టెన్జెన్ ఇమ్నా ఓ ఆసక్తికర వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేస్తుంది. నాగాలాండ్‌లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం భారత్, మయన్మార్ దేశాల సరిహద్దులుగా కలిగి ఉండటమే దీని ప్రత్యేకత లాంగ్వా గ్రామానికి ఓ వైపు మయన్మార్ దట్టమైన అడువులు ఉండగా.. మరోవైపు భారత్‌లోని వ్యవసాయ భూమి సరిహద్దుగా కలిగి ఉంది. 1970లో భారతదేశం, మయన్మార్ మధ్య సరిహద్దులు సృష్టించడానికి చాలా కాలం ముందే లాంగ్వా గ్రామం ఏర్పడింది. అధికారులు సరిహద్దు రేఖను గీస్తున్నప్పుడు, వారు తమ కమ్యూనిటీ విభజించేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామం గుండా సరిహద్దు గీశారు. అందుకే ఒక సరిహద్దు పిల్లర్‌పై బర్మీస్ బాషలో రాసి ఉంటే మరో పిల్లర్‌పై హిందీలో రాసి ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా నివసిస్తుంటారు. నాగాలాండ్‌లో గుర్తింపు పొందిన 16 గిరిజనుల్లో కొన్యాక్ తెగ అతి పెద్దది. కొన్యాక్ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా పిలవబడుతుంటాడు. లాంగ్వా గ్రామం భారత్, మయన్మార్ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్నప్పటికీ ఓకే వ్యక్తి దీనిని పాలిస్తున్నాడు. అతని పాలన 75 గ్రామాలకు విస్తరించింది. ఇందులో కొన్ని మయన్మార్‌కు, మరికొన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వానికి తన ప్రజలకు ఆంగ్ వారధిగా వ్యవహరిస్తుంటారు. అంతేగాక మయన్మార్, భారత్ సరిహద్దు రేఖ ఇతని ఇంటి గుండా వెళుతుంది. ఇతని ఇళ్లు ఇండియా, మయన్మార్‌ను వేరు చేస్తుంది. ఇంట్లోని సగభాగం భారత్‌లో ఉంటే మిగిలిన సగం మయన్మార్‌కు చెందుతుంది. అంటే ఆంగ్ తమ కిచెన్ నుంచి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడమంటే ఏకంగా దేశ సరిహద్దు దాటడమే అన్నట్లు. అంతేగాక ఈ సరిహద్దు లాంగ్వా ప్రజలను విభజించడానికి బదులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ గ్రామం గుండా మొత్తం నాలుగు నదులు ప్రవహిస్తుండగా అందులో రెండు భారత్ భూభాగంలో ఉండగా.. మరో రెండు నదులు మయన్మార్ భూభాగం పరిధిలోకి వస్తాయి. దీనిని నాగాలాండ్ మంత్రి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆ కుటుంబం ఇండియాలో నిద్రపోతే(బెడ్రూం).. మయన్మార్‌లో తింటారు(కిచెన్) అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. OMG | यह मेरा इंडिया To cross the border, this person just needs to go to his bedroom. बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃 @incredibleindia @HISTORY @anandmahindra pic.twitter.com/4OnohxKUWO — Temjen Imna Along (@AlongImna) January 11, 2023 -
కొండచరియలు పడి 50 మంది మృతి!
యాంగాన్: మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మయన్మార్ ఉత్తర ప్రాంతంలో ఉన్న కాచిన్ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన వారు బతికిఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. ప్రమాదాన్ని మయన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. చైనా సరిహద్దుల్లో రంగురాళ్ల కోసం ఇష్టారీతిన నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల కొండచరియలు విరిగిపడి ప్రతి సంవత్సరం చాలా మంది మరణిస్తున్నారు. -
ఏడుగురు రోహింగ్యాలు వెనక్కి
న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమంగా నివాసముంటున్న ఏడుగురు రోహింగ్యాలను గురువారం భారత్ దేశం నుంచి పంపించివేసింది. వారి స్వదేశమైన మయన్మార్‌కు పంపించింది. భారత్‌నుంచి రోహింగ్యా ముస్లింలను పంపించేయడం ఇదే తొలిసారి. 2012లో వీరిని గుర్తించి విదేశీయుల చట్టం కింద అరెస్టు చేశారు. అప్పటి నుంచి వీరంతా అస్సాంలోని కచార్ జైల్లోనే ఉన్నారు. ‘ఏడుగురు మయన్మార్ దేశస్తులను నేడు భారత్ నుంచి బహిష్కరించాం. మయన్మార్–మణిపూర్ సరిహద్దుల్లోని మోరే వద్ద ఆ దేశ అధికారులకు వీరిని అప్పగించాం. మయన్మార్ దౌత్యవేత్తలు కూడా వీరిని తమ దేశస్తులుగా గుర్తించారు.ఈ ఏడుగురికి ట్రావెల్ డాక్యుమెంట్లను కూడా ఇచ్చారు’ అని అస్సాం అదనపు డీజీ భాస్కర్ మహంతా పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్ పచ్చజెండా: వీరిని పంపించే విషయంలో చివరి నిమిషం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమను పంపించేయవద్దంటూ ఈ ఏడుగురిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గురువారం ఉదయం ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. వీరంతా (26 నుంచి 32 ఏళ్ల లోపు వారే) అక్రమంగా భారత్‌లో ఉంటున్నందున పంపించాల్సిందేనని ఆదేశించింది. ‘వీరి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోం. పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. మయన్మార్ కూడా వీరిని తమ పౌరులుగా గుర్తించింది’ అని సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విడుదలైన తర్వాత వీరంతా అస్సాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దేశంలో 14వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపిందని గతేడాది ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల వివరాల ప్రకారం దేశంలో 40వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు ఉన్నారని తేలింది. -
చిచ్చురేపిన ‘పిల్లర్ 81’
సాక్షి, న్యూఢిల్లీ : అది మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లా, క్వాతా కునౌ అనే కుగ్రామం. అక్కడ పట్టుమని పది కుటుంబాలు కూడా లేవు. ఊరు నుంచి పారే వాగు నీరే వారికి తాగు నీరు, సాగు నీరు. చుట్టూ ఎత్తైన కొండలు, కోనలు, దట్టమైన అడవితో అందమైన ప్రకృతి. పచ్చని పంటల మధ్య కడుపు చల్లగా ఆ కుటుంబాల జీవితం వెచ్చగా సాగిపోతోంది. వారి జీవితాల్లో ఇప్పుడొక సరిహద్దు రాయి చిచ్చు రేపింది. సరిగ్గా ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన మయన్మార్, మణిపూర్ సరిహద్దు రాయి గ్రామానికి ఈవల ఇటీవల వెలసింది. అప్పటి నుంచి సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు క్వాతా కునౌ గ్రామం వనరులను దోచుకుంటున్నారు. అడ్డుపడితే గొడవ పడుతూ దాడులకు కూడా సిద్ధం అవుతున్నారు. మణిపూర్ నుంచి మయన్మార్‌కు పారుతున్న నంజిలోక్ నదిపై క్వాతా కునౌ గ్రామస్థులు కట్టుకున్న చిన్న డామ్‌లోని నీటిని సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు తమ వ్యవసాయానికి వాడుతున్నారు. ఇప్పుడు మయన్మార్ సరిహద్దు లోపల ఉన్నందున డ్యామ్ తమదేనని గ్రామస్థులను దబాయించడమే కాకుండా సరిహద్దు ఆవలికి తరలి పోవాల్సిందిగా కూడా గ్రామస్థులను బెదిరిస్తున్నారు. మూడు కిలోమీటర్లకు ఆవల ఉండాల్సిన సరిహద్దు 81వ రాయి ఊరవతలికి ఎలా వచ్చిందని తెంగ్నౌపాల్ జిల్లా కమిషనర్ అబుజమ్ తొంబికాంటా సింగ్‌ను మీడియా ప్రశ్నించగా భారత్, మైన్మార్ సంయుక్త సర్వే బందం ఇటీవలనే ఈ అనుబంధ సరిహద్దు రాయిని ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతకుమించి ఆయన వద్ద సమాచారం లేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దు రాయులు ఎక్కడో దూరాన ఉండడం వల్ల అనుబంధ సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకోవాలని మయన్మార్‌లోని తాము నగరంలో గత అక్టోబర్ నెలలో జరిగిన ఉమ్మడి చర్చల్లో నిర్ణయించారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కశ్మీర్‌లాగా ఆధీన రేఖ, వాస్తవాధీన రేఖ అంటూ భారత్–మయన్నార్ దేశాల మధ్య లేనప్పుడు ఎందుకు ఈ అనుబంధ సరిహద్దు రాళ్లు అన్న ప్రశ్నకు ఆయన వద్ద కూడా సమాధానం దొరకలేదు. సరిహద్దును కాపాలాగాసే అస్సాం రైఫిల్స్ దళాలకు అనువుగా ఉండేందుకు అనుబంధ సరిహద్దు రాయినీ ఏర్పాటు చేశారని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది మయన్మార్‌కు భూమిని ధారాదత్తం చేయడమేనని రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్, పలు సామాజిక సంస్థలు గొడవ చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ భైరేన్ సింగ్, శాసన సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు, అస్సాం రైఫిల్స్ ప్రతినిధులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని వేశారు. మణిపూర్, మయన్మార్ మధ్య 1969–70 మధ్య ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి కూడా ముందుకు కదిలి వచ్చిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. 1967, మార్చి నెలలో మయన్మార్‌తో భారత్‌కు మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం ఆ రాయిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు లేవు. 1969–70లో ఏర్పాటు చేసిన 81 రాయి మూడు కిలీమీటర్లకు ఆవల ఉండగా, 2010, అక్టోబర్ నెలలో ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి దాదాపు కిలోమీటరు ఇవతలకు ఉంది. 2017–18 సంవత్సరంతో ఇటీవల ఏర్పాటు చేసిన సరిహద్దు రాయి సరిగ్గా మూడు కిలోమీటర్ల ఇవతల ఉంది. ఈ రాయిపైనా 81కి బదులు 80 అనే అంకె ఉంది. 81 అనే రాయి మరోటి ఉందని చెప్పడానికా? అలా చెప్పి సమర్థించుకోవడానికా? తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. కశ్మీర్లో అంగుళం స్థలం కూడా వదులుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వం మయన్మార్‌కు మాత్రం మూడు కిలోమీటర్ల విస్తీర్ణ స్థలాన్ని ఎలా వదిలేసిందని, ఎన్ని వేల కోట్లు చేతులు మారాయంటూ కాంగ్రెస్, స్థానిక సామాజిక వర్గలు రాష్ట్రంలో వరుస ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీనే తాను ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ నివేదిక అందినప్పటికీ దాన్ని బహిర్గతం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి భరేన్ సింగ్ ఈ నెల 11వ తేదీన సరిహద్దు, అనుబంధ సరిహద్దు రాళ్లను తేల్చడానికి ఓ ఉన్నతాధికార బందాన్ని పంపించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. జూలై 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర బందం వస్తోంది. -
రాయి ఇనుముని తినేస్తుంది
-
ఇనుమును తినేస్తున్న రాయి.. వైరల్ వీడియో
మయన్మార్ : ప్రపంచంలో కొన్ని ఘటనలు వినడానికి వింతగా ఉంటాయి. కొన్ని సార్లు వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టం. అవి ఎలాంటివి అంటే దేవుడి విగ్రహం ముందు పాలు పెడితే తగ్గడం, చెట్ల మొదళ్ల నుంచి పాలు కారడం, విగ్రహాల చుట్టూ జంతువులు చేరి పూజ చేయడం, మరికొన్ని చోట్ల వాటి కళ్ల నుండి నీరు, ఏదైనా ద్రవం రావడం వంటివి. అవి చిత్రంగా ఉంటూ అందరినీ ఆకర్శిస్తాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి మయన్మార్‌లో జరిగింది. సాధారణంగా ఇనుమును కరగ తీయడం కోసం నిప్పుల్లో ఉంచుతారు. కానీ మయన్మార్‌లో మాత్రం ఓ రాయి చిత్రంగా ఇనుముని తినేస్తోంది. రాయి ఇనుమును తినడం ఏంటి అనుకోకండి.. కానీ ఇది నిజం. గోడకు కొట్టే మేకుని దానిపై ఉంచితే నిమిశాల్లో కరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆదేశ సైనికుడు కనిపెట్టాడు. ఇనుమును రాయి తినేస్తుందంటే ఎవరూ నమ్మలేదు. పైగా పిచ్చివాడిగా చూశారు. దీంతో మేకును రాయిపై ఉంచి వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోని 9 మిలియన్ల మంది చూశారు. ఈ రాయిని పరిశీలించిన శాష్త్రవేత్తలు, ఈ రాయి ఓ విలక్షణమైన లక్షణాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇనుమును కరిగించడానికి గల కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
శరణార్థులు.. డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్
ఢాకా : మయన్మార్నుంచి బంగ్లాదేశ్‌కు మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు రోహింగ్యాల ముస్లింలను, ఒక బంగ్లా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. మయన్మార్నుంచి బంగ్లాకు భారీగా రోహింగ్యా ముస్లింలు వలస వస్తున్న నేపథ్యంలో.. శరణార్థుల మాదిరిగానే కొందరు రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లోకి వచ్చిపోతూ.. మత్తుమందులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి శరణార్థులగా వస్తున్న ముగ్గురి దగ్గర.. 8 లక్షల మెథామెథమిన్ టాబ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ యేజర్ రవుల్ అమీన్ తెలిపారు. ఈ టాబ్లెట్స్‌లో కోకైన్ అధికంగా ఉండి.. మత్తును కలిగిస్తుంది. ఈ టాబ్లెట్స్‌ను బంగ్లాదేశ్ యువత అధికంగా వినియోగిస్తోంది. దీనిని అరికట్టేందుకు కొన్నేళ్లుగా బంగ్లదేశ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శరణార్థులగా మయన్మార్నుంచి బంగ్లాకు వస్తున్నవారిలో చాలామంది అక్రమంగా మత్తుపదార్థాలను రవాణా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా అదుపులోకి తీసుకున్నవారిలో ఒకరు పాత శరణార్థికాగా.. ఇద్దరు కొత్తగా బంగ్లాదేశ్‌కు వస్తున్న శరణార్థులని ఆయన చెప్పారు. -
నాగా తిరుగుబాటుదారులపై పంజా
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంత తిరుగుబాటు సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దులో బుధవారం వేకువ జామున భారత బలగాలు జరిపిన ప్రతీకార దాడుల్లో ఎన్ఎస్సీఎన్–కే భారీగా నష్టపోయినట్లు తూర్పు కమాండ్ ప్రకటించింది. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమకెలాంటి నష్టం వాటిల్లలేదని ఎన్ఎస్సీఎన్–కే పేర్కొంది. ‘భారత్–మయన్మార్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై ఎన్ఎస్సీఎన్–కే తిరుగుబాటుదారులు ఉదయం 4.45 గంటలకు కాల్పులు జరిపారు. బదులుగా భారత బలగాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. తిరుగుబాటుదారులు భారీగా నష్టపోయారు. భారత బలగాలు వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని తూర్పు కమాండ్ ప్రకటించింది. చనిపోయిన లేదా గాయపడిన తిరుగుబాటుదారులెందరో వెల్లడించలేదు. భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదని పేర్కొంది. భారత్ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు వెలువడిన వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేసింది. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా...‘మయన్మార్ భారత్‌కు మిత్ర దేశం అనడంలో మరో అభిప్రాయానికి తావు లేదు. మాకు అందిన సమాచారాన్నే మీకు తెలియజేస్తాం’ అని బదులిచ్చారు. ముగ్గురు జవాన్లు హతం: ఎన్ఎస్సీఎన్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎన్ఎస్సీఎన్ పీఆర్వో ఇసాక్ సుమి ఈ దాడి గురించి సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. భారత్–మయన్మార్ సరిహద్దుకు 10–15 కి.మీ దూరంలోని మయన్మార్ ఆక్రమిత నాగా ప్రాంతంలోని లాంగ్‌కు గ్రామంలో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించాడు. ‘తమ శిబిరాల వైపు వస్తున్న భారత ఆర్మీని గుర్తించిన నాగా తిరుగుబాటుదారులు తెల్లవారు జామున 3 గంటలకు కాల్పులకు దిగారు. నేను ఈ పోస్ట్ చేసే సమయంలోనూ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి’ అని పోస్ట్ చేశాడు. ఈ దాడుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు వెల్లడించాడు. తమ వర్గంవైపు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాడు. ఇసాక్ ప్రస్తుతం మయన్మార్‌లోని యాంగాన్‌లో ఉన్నట్లు అతని పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇసాక్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత ఆర్మీ...ఈ దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కావంది. మణిపూర్‌లో 20 మంది సైనికుల హత్యకు ప్రతీకారంగా 2015, జూన్‌లో కూడా ఆర్మీ ఇలాంటి ఆపరేషనే చేపట్టి వారికి తీవ్ర నష్టం మిగిల్చింది. -
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్..
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన 70మంది పారా కమాండోల బృందం ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు ఈ దాడి నిర్వహించింది. లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా టెర్రర్ క్యాంప్స్ను ధ్వంసంచేసింది. ఈ మెరుపుదాడుల్లో ఎన్ఎస్సీఎన్-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. మన కమాండోలకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. జవాన్లపై నాగాలు దాడికి దిగడంతో.. వారిని నిలువరించే క్రమంలోనే మెరుపుదాడులు చేసినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి. ఎస్ఎస్ ఖప్లాంగ్ నేతృత్వంలో ఏర్పడిన ఎన్ఎస్సీఎన్-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం గమనార్హం. -
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్.. ఈసారి టార్గెట్ నాగా టెర్రర్!
-
శరణార్థులు ఆగినట్టేనా?
ఢాకా : రోహింగ్యా వలసలకు కాస్త విరామం వచ్చిందని బంగ్లాదేశ్ శనివారం ప్రకటించింది. మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ తరువాత.. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌కు సుమారు 4 లక్షల 30 వేల మంది రోహింగ్యాలు శరణార్థులుగా వచ్చారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. బంగ్లా-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో రోహింగ్యాలు కిక్కిరిసి ఉన్నారని ఐక్యరాజ్య సమితి, బంగ్లాదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల నుంచి మయన్మార్ సరిహద్దుల నుంచి, నాఫ్ నదినుంచి శరణార్థులు రావడం లేదని సరిహద్దు భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే.. ఇక రోహింగ్యా శరణార్థుల ప్రవాహం ఆగినట్టే ఉందని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) కమాండర్ ఎస్.ఎం. ఆరిఫుల్ ఇస్లామ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. శరణార్థుల సంఖ్యను రోజువారీ గణాంకాలను వెల్లడించాలని ఐక్యరాజ్యసమితి కోరినట్లు ఆయన చెప్పారు. సమితి తీసుకున్న చర్యల వల్లనే రోహింగ్యాల ప్రవాహానికి అడ్డుకట్ట పడి ఉండొచ్చని ఆయన అన్నారు. రోహింగ్యా మిలిటెంట్ల ఏరివేతను ఆపుతన్నట్లు మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీ గత వారం చేసిన ప్రకటనతో కొంతవరకూ ఫలితం వచ్చి ఉంటుందని మరో అధికారి మంజ్రుల్ హసన్ ఖాన్ చెప్పారు. ఆగస్టు 25న పోలీస్ పోస్ట్‌లపై రోహింగ్యా మిలిటెంట్లు దాడి చేసిన తరువాత.. సైన్యం ప్రతీకార చర్యలకు దిగడంతో మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీంతో రోహింగ్యాలు మయన్మార్‌ను వీడి బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారు. -
ఉగ్రవాదుల కాల్పులు : జవాన్లకు గాయాలు
న్యూఢిల్లీ: భారత్ - మయన్మార్ సరిహద్దుల్లోని చందల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సరిహద్దుల్లో పహారా కాస్తున్న అసోం రైఫిల్స్‌కు చెందిన జవాన్ల శిబిరాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. దాంతో తీవ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఇద్దరిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా.... వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. భద్రత దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నాధికారులు వివరించారు.