భారత్ - మయన్మార్ సరిహద్దుల్లోని చందల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
న్యూఢిల్లీ: భారత్ - మయన్మార్ సరిహద్దుల్లోని చందల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సరిహద్దుల్లో పహారా కాస్తున్న అసోం రైఫిల్స్కు చెందిన జవాన్ల శిబిరాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. దాంతో తీవ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.
అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఇద్దరిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా.... వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. భద్రత దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నాధికారులు వివరించారు.