ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని బయోలాజికల్ పార్కులో దారుణం చోటు చేసుకుంది. 35 ఏండ్ల వయసున్న పౌలాష్ కర్మకర్ అనే జూ అటెండెంట్‌పై రాయల్ బెంగాల్ టైగర్ దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్‌లోకి పౌలాష్ ప్రవేశించి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నాడు.
ఆ సమయంలో ఒక్కసారిగా పులి అతనిపై దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి నిర్లక్ష్యంగా వ్యవరించడంతో ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు అస్సాంలోని లఖింపూర్ జిల్లాలోని ధేకిజులికి చెందిన వ్యక్తిగా జూ అధికారులు తెలిపారు .ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment