Arunachalpradesh
-
జూ సిబ్బంది పై రాయల్ బెంగాల్ టైగర్ ఎటాక్..
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని బయోలాజికల్ పార్కులో దారుణం చోటు చేసుకుంది. 35 ఏండ్ల వయసున్న పౌలాష్ కర్మకర్ అనే జూ అటెండెంట్‌పై రాయల్ బెంగాల్ టైగర్ దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్‌లోకి పౌలాష్ ప్రవేశించి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పులి అతనిపై దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి నిర్లక్ష్యంగా వ్యవరించడంతో ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు అస్సాంలోని లఖింపూర్ జిల్లాలోని ధేకిజులికి చెందిన వ్యక్తిగా జూ అధికారులు తెలిపారు .ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి:దారుణం: ఎంత పని చేశావు తల్లీ! -
చిరుత హెలికాప్టర్ పేలి ఇద్దరు పైలెట్లు మృతి
థింపూ/భూటాన్: భారత రక్షణ దళానికి చెందిన చిరుత హెలికాప్టర్ పేలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. భారత సైనిక శిక్షణ బృందం(ఐఎమ్‌టీఏఆర్)కు సంబంధించిన చాపర్ తూర్పు భుటాన్ యంగ్‌పుల్లా డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం క్రాష్ అవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోగమంచుతో కూడిన వాతావరణం వల్లే హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. భారత ఆర్మీకి భూటాన్‌లో శిక్షణను ఇస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకులంగా లేకపోవడంతో..ఐఎమ్‌టీఏఆర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిర్ముకు చేరుకోగానే రెడియో సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ క్రమంలో హెలికాప్టర్ ప్రమాదాన్ని అంచనా వేయలేక పోయామని భారత ఆర్మీ అధికారి కొల్ అమన్ అనంద్ పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని.. భారత వైమానిక దళం, ఆర్మీ హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టామన్నారు. మరణించిన వారిలో భూటాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ రాయల్, ఏవియేషన్ కార్ప్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
‘అది మ్యానిఫెస్టో కాదు..అసత్యాల పత్రం’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ మ్యానిఫెస్టో అసత్యాల మయమని, అది మ్యానిఫెస్టో కాదని అవాస్తవాల పత్రమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తరహాలోనే వారి మ్యానిఫెస్టో సైతం అవినీతి, అబద్ధాలతో కూడుకున్నదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బుధవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని పసీఘట్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు అసత్య వాగ్దానాలు - అంకితభావానికి, విశ్వాసం - అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. ఈశాన్య భారతంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మీ సంస్కృతిని అవమానించిన వారు ఓవైపు ఉండగా, మీ సంస్కృతిని సొంతం చేసుకున్న మీ కాపలాదారుడిగా తానున్నానని అన్నారు. తూర్పు ఆసియా అంతటికీ ఈశాన్య భారత ముఖద్వారంగా అరుణాచల్ ప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. రైతులకు విత్తనం నుంచి మార్కెట్ వరకూ చేయూత ఇచ్చేలా పీఎం కిసాన్ పధకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. -
మైనర్‌ను రేప్ చేస్తే మరణశిక్షే
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదముద్ర తెలిపింది. క్రిమినల్ లాస్(అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు–2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్ వాయి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికల(మైనర్)పై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవశిక్షగా కూడా మార్చవచ్చు. వీటితో పాటు దోషులకు జరిమానా కూడా విధించవచ్చు. 2015 నుంచి 2017 నవంబర్ వరకూ రాష్ట్రంలో 225 రేప్ కేసులు నమోదుకాగా.. ఒక్క 2016లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో భాగంగా పలువురు సభ్యుల సిఫార్సుతో అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. -
రిజిస్ట్రేషన్ ఒకటి.. బస్సులు రెండు
సామర్లకోట: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఒకే నెంబరుతో రెండు బస్సులు నడుపుతున్న సిరి ట్రావెల్స్‌కు చెందిన ఎఆర్ 01 1166 నెంబరు బస్సును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి సీజ్ చేశారు. బస్సు కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు పంపారు. -
భూపాతం: 14 మంది మృతి?
పాపుంపరే: అరుణాచల్ ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పాపుంపరే జిల్లా లాప్టాప్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచెరియలు విరిగి పడటంతో గ్రామానికి చెందిన 14 మంది జాడ తెలియకుండా పోయారు. ప్రస్తుతం సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అయితే, వీరు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు లేవని అధికారులు తెలిపారు. కాగా గత నాలుగు రోజులుగా పాపుంపరేలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శకలాలు దొరికాయి
ఇటానగర్: భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ శకలాన్ని బుధవారం అరుణాచల్‌ప్రదేశ్ సమీపంలో అధికారులు గుర్తించారు. మంగళవారం హెలికాప్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. వాళ్లు ప్రాణాలతో ఉన్నారా.. లేదా అన్న విషయం తెలియడం లేదని రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పపుమ్పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ఈ హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభించిన కొద్ది సమయానికే రాడార్‌తో సంబంధాలు కోల్పోయినట్లు రక్షణశాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సంబిత్ఘోష్ తెలిపారు. సగలీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన అడ్వాన్సెడ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) మంగళవారం సగలీ బయలుదేరింది. ఆ సమయంలోనే హెలికాప్టర్ అదృశ్యమైంది. -
తెలుగు బస్సులకు అరుణాచల్ బ్రేక్
► ఆ రాష్ట్రంలో రిజిస్ట్రర్ అయిన బస్సు పర్మిట్లు రద్దు ►తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న వెయ్యి ట్రావెల్ బస్సులపై వేటు ►ఇకపై పెనాల్టీలు ఉండవు.. జప్తు చేస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: నిబంధనలను బేఖాతరు చేస్తూ చట్ట విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు పర్యాటక రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ షాకిచ్చింది! రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెయ్యి బస్సులు రోడ్డెక్కకుండా చేసింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కంగుతిన్నాయి. ఇదీ సంగతి.. ఆదాయమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలు ఏమీ చేయలేకపోగా చిన్న రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ ముప్పు తిప్పలు పెడుతోంది. పర్యాటక రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో 2+1 విధానంతో స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతోపా టు పర్మిట్ పన్ను తక్కువగా ఉండటంతో తెలం గాణ, ఏపీలకు చెందిన పలు ట్రావెల్స్ యజమానులు తమ బస్సులను ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అక్కడ్నుంచే పర్మిట్ పొంది ఇక్కడ తిప్పుతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ నిబం ధనల ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని పర్మిట్ పొందిన బస్సులు కనీసం నెలలో ఒకసారి ఆ రాష్ట్రానికి వెళ్లాలి. కానీ ఆ నిబంధనను బేఖాతరు చేయడంతోపాటు స్థాయికి మించి సీట్లు, బెర్తుల సంఖ్య పెంచుకొని ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా డబ్బు చేసుకుంటున్నారు. ఏపీకి చెందిన కేశినేని ట్రావెల్స్ ఇటీవల తమ బస్సుల నిర్వహణను నిలిపేసింది. కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ నిర్వాహకులకు ఆ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌కు మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, నిబంధనలను బేఖాతరు చేస్తున్న తీరు పై ఏపీకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు అరుణాచల్‌ప్రదేశ్ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘన నిజమేనని తేల్చి ఆయా ట్రావెల్స్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలను పాటించని దాదాపు వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేస్తున్నట్లు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖలకు ఆదేశాలను పంపింది. దీంతో తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని 2+1 స్లీపర్ విధానం ఇక్కడ అమలుచేయించుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు యత్నిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆదేశాలు తమ చేతికి అందగానే తక్షణం చర్యలు ప్రారంభిస్తామని తెలం గాణ రవాణాశాఖ జేటీసీ రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ఇంతకాలం పెనాల్టీతో సరి... ఇక జప్తే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడి నిబంధనలకు విరుద్ధంగా 2+1 స్లీపర్ విధానంతో తిరుగుతున్న బస్సులపై ఇప్పటివరకు తెలంగాణ రవాణా శాఖ పెనాల్టీలు మాత్రమే విధిస్తూ వచ్చింది. అడపాదడపా పెనాల్టీలు విధించడం రవాణశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి అలవాటుగా మారింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేయడంతో ఈ బస్సులు తెలంగాణ పరిధిలో తిరగడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ఆ బస్సులు కనిపిస్తే జప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పరీక్షలో పెమా పాసయ్యాడు
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం బతికింది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిని పెమా ఖండూ విశ్వాస పరీక్ష నెగ్గారు. బుధవారం నిర్వహించిన ఈ పరీక్షలో ఆయనకు అనుకూలంగా 46 మంది ఓట్లు వేశారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 45 స్థానాలు ఉండగా 11 స్థానాలు బీజేపీకి మిగతావి ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు ఉన్నాయి. అంతకుముందు రాష్ట్రపతి పాలన ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అది రద్దయిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నబం టుకీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే టుకీని వ్యతిరేకించినవారిలో ఒకరైన పెమా ఖండూ గత ఆదివారం రాజధాని ఈటానగర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ సమయంలో జరగాల్సిన విశ్వాస పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షలో పెమా ఖండూ నెగ్గారు. -
'కొత్త సీఎం ప్రమాణం చేశారు'
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజధాని ఈటానగర్ లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నబాంగ్ టుకీపై శనివారం అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఓ గంట ముందు నాటకీయ పరిణామాల మధ్య ఆయన ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. టూకీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ లో రెబల్స్ గా మారిన 30 మంది ఎమ్మెల్యేలలో ఖండూ కూడా ఒకరు. వారి సపోర్టుతో గవర్నర్ కు లేఖను సమర్పించిన ఖండూ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమయ్యార. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠం మార్పు వెనుక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చక్రం తిప్పినట్లు సమాచారం. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 45 మెజారిటీ స్థానాలను గెలుపొందింది. -
అరుణాచల్ సీఎంగా ఖండూ ప్రమాణ స్వీకారం