
భూపాతం: 14 మంది మృతి?
పాపుంపరే: అరుణాచల్ ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పాపుంపరే జిల్లా లాప్‌టాప్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచెరియలు విరిగి పడటంతో గ్రామానికి చెందిన 14 మంది జాడ తెలియకుండా పోయారు. ప్రస్తుతం సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అయితే, వీరు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు లేవని అధికారులు తెలిపారు. కాగా గత నాలుగు రోజులుగా పాపుంపరేలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.