థింపూ/భూటాన్: భారత రక్షణ దళానికి చెందిన చిరుత హెలికాప్టర్ పేలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. భారత సైనిక శిక్షణ బృందం(ఐఎమ్‌టీఏఆర్)కు సంబంధించిన చాపర్ తూర్పు భుటాన్ యంగ్‌పుల్లా డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం క్రాష్ అవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోగమంచుతో కూడిన వాతావరణం వల్లే హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. భారత ఆర్మీకి భూటాన్‌లో శిక్షణను ఇస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకులంగా లేకపోవడంతో..ఐఎమ్‌టీఏఆర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిర్ముకు చేరుకోగానే రెడియో సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ క్రమంలో హెలికాప్టర్ ప్రమాదాన్ని అంచనా వేయలేక పోయామని భారత ఆర్మీ అధికారి కొల్ అమన్ అనంద్ పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని.. భారత వైమానిక దళం, ఆర్మీ హెలికాప్టర్‌లతో సహాయక చర్యలు చేపట్టామన్నారు. మరణించిన వారిలో భూటాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ రాయల్, ఏవియేషన్ కార్ప్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment