ఆగ్రా : నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మలవాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, అక్కడ పనిచేసే కార్మికులతో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
UP: Under-construction bridge collapses on NH-91 in Chechana area of Malawan police limits in #Etah. pic.twitter.com/9U0MLDuC7w
— TOI Agra (@TOIAgra) June 19, 2020
'పశువుల కోసం గడ్డి తీసుకెళ్తున్న ట్రక్‌పై 30 అడుగుల ఎత్తు నుంచి వంతెన కూలిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. నాసిరకం కాంక్రీటు వాడటం వల్లే వంతెన కూలిపోయిందని ప్రాథమికంగా అంచనా వేశాం. పీఎన్‌సి ఇన్‌ఫ్రా టెక్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం' అని పోలీసు అధికారి రాహుల్ కుమార్ తెలిపారు. కాగా పిఎన్‌సి ఇన్‌ఫ్రా టెక్ చైర్మన్..ఆగ్రా నగర మేయర్ సోదరుడు అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment