వారణాసి ఫ్లై ఓవర్ ప్రమాదం తాలుకు దృశ్యాలు
వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వారణాసిలోని కాంట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరికొందరు కూలీలు శకలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మంత్రి నీల్‌కాంత్ తివారీలను ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా సీఎం యోగి ఆదేశించారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
Extremely saddened by the loss of lives due to the collapse of an under-construction flyover in Varanasi. I pray that the injured recover soon. Spoke to officials and asked them to ensure all possible support to those affected.
— Narendra Modi (@narendramodi) 15 May 2018
I spoke to UP CM Yogi Adityanath Ji regarding the situation due to the collapse of an under-construction flyover in Varanasi. The UP Government is monitoring the situation very closely and is working on the ground to assist the affected.
— Narendra Modi (@narendramodi) 15 May 2018
Comments
Please login to add a commentAdd a comment