ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అమెరికన్ ఆగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో ఆరు పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు.
పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A
— ANI (@ANI) November 21, 2023
Comments
Please login to add a commentAdd a comment