
భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
జైపూర్ :
గ్యాంగ్‌గా ఏర్పడి భారీ వసూళ్లకు పాల్పడుతున్న మెగా సెక్స్ రాకెట్‌ను స్పెషల్ పోలీసులు చేధించారు. గ్యాంగ్‌కు చెందిన యువతులు సంపన్నులతో పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత క్లోజ్‌గా మూవ్ అవ్వడం. అనంతరం రూమ్‌కి పిలిచి, వారితో ఏకాంతంగా గడిపి, రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టైల్. ఈ సెక్స్ రాకెట్ గ్రూప్ దాదాపు ఏడాది నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఇప్పటి వరకు దాదాపు రూ.20 కోట్లకుపైగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఆరుగురు యువతులతో సహా మొత్తం33న మందిని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో ఆరుగురు లాయర్‌లు కూడా ఉన్నారు.
సెక్స్ రాకెట్‌కు చెందిన షికా తివారి ముంబైలోని ఓ హోటల్‌లో డీజేగా పని చేస్తోంది. జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను ట్రాప్ చేసి బ్రాక్‌మెయిల్‌కు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
గ్యాంగ్‌లో ముఖ్యపాత్రపోషిస్తున్న అకన్‌షా హిజ్‌కిల్, ఆమె బోయ్ ఫ్రెండ్ అక‌్షంత్ శర్మను మంగళవారం రాత్రి అజ్మీర్‌లో అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సంపన్నులను లక్ష్యంగా చేసుకొని, ట్రాప్‌లోకి దించి బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్లకు పాల్పడేదని పోలీసుల విచారణలో తేలింది. తమ డిమాండ్‌లకు ఒప్పుకోకపోతే కొన్ని సందర్భాల్లో బాధితులపై రేప్ కేసులు కూడా నమోదు చేశారని పోలీసులు తెలిపారు.