హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 13 మందిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఆరు ల్యాప్టాప్లు, మూడు టీవీలు, 36 సెల్ ఫోన్లు, 2 మౌత్ స్పీకర్లు, 4 లయన్ బాక్సులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ల్లో హైదరాబాద్కు చెందిన సత్యప్రకాశ్ జిందాల్ అలియాస్ నిక్కూబాయ్ ప్రధాన నిందితుడు అని తెలిపారు. రాజస్థాన్ కేంద్రంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం సాగుతుందన్నారు. ఇంటర్నేషనల్ బెట్టింగ్ కూడా కొనసాగుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఈ వ్యవహారంలో రాజస్థాన్కు చెందిన ఆషును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పెద్దెఎత్తున క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని మహేందర్రెడ్డి చెప్పారు.