betting racket
-
పొలమే గ్రౌండ్, కూలీలే క్రికెటర్లు.. గుజరాత్లో బయటపడ్డ ఫేక్ ఐపీఎల్ బండారం
గ్రౌండ్లో ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఓ వైపు బ్యాట్స్‌మన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. మరో వైపు బౌలర్లు వికెట్లు పడగొట్టేస్తున్నారు.. లైవ్‌లో ప్రేక్షకులు ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు. అటు మ్యాచ్‌లో ఏ ఓవర్లో ఎన్ని రన్స్ రావొచ్చన్న దాని నుంచి ఫోర్లు, సిక్సర్లు, ఔట్లు, ఎవరెంత స్కోర్ చేస్తారనే దాకా బెట్టింగ్‌ల మీద బెట్టింగ్‌లు సాగుతున్నాయి. క్రికెట్ అన్నాక ఇదంతా కామనే అంటారు కదా.. ఇందులో చివరన చెప్పిన బెట్టింగులు మాత్రమే నిజం. మిగతా అంతా ఉత్త ఫేక్! విదేశీయులతో బెట్టింగ్‌లు కాయించి డబ్బులు దండుకోవడానికి ఓ ముఠా ఏకంగా ఫేక్ ఐపీఎల్‌నే నడిపించింది. ఇటీవలే గుజరాత్ పోలీసులు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులు, బెట్టింగ్ దందాను బయటపెట్టారు. అచ్చం ఐపీఎల్ మ్యాచ్‌లను తలపించేలా.. కొందరు గుజరాత్‌లోని మెహ్సానా పట్టణానికి కాస్త దూరంలోని మోలిపూర్ గ్రామంలో శ్మశానం పక్కన ఓ పొలాన్ని నెలవారీ అద్దెకు తీసుకున్నారు. దాన్ని చదును చేసి.. మధ్యలో పిచ్‌ను, ఇతర గుర్తులను సిద్ధం చేసి ఓ క్రికెట్ గ్రౌండ్లా మార్చారు. స్థానికంగా ఉన్న 25 మంది రైతులు, కూలీలకు రోజుకు రూ. నాలుగైదు వందలు ఇస్తామని చెప్పి క్రికెట్ ఆటగాళ్లుగా పెట్టుకున్నారు. అచ్చం ఐపీఎల్ టోర్నీలో వివిధ జట్లను పోలిన డ్రెస్‌లను వేయించి.. ఆయా జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్న ట్టుగా హడావుడి చేశారు. అంపైర్లను పెట్టి, వారికి వాకీటాకీలు ఇచ్చి.. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా చేశారు. దీనంతటినీ అధునాతన కెమెరాలతో చిత్రీకరిస్తూ.. ‘ఐపీఎల్’ పేరిట క్రియేట్ చేసిన యూట్యూబ్‌లో చానల్లో లైవ్ ప్రసారం చేశారు. నిజమైన మ్యాచ్‌ల తరహాలో స్కోర్, బాల్స్, ఇతర గ్రాఫిక్స్‌ను పెట్టి.. నిజంగానే ఏదో పెద్ద ఆటగాళ్ల లైవ్ మ్యాచ్ అనిపించేలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రేక్షకుల గోల, ఈలలు, చప్పట్లు వినిపించేలా సౌండ్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లైవ్‌కు యాడ్ చేశారు. ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ ‘హర్ష భోగ్లే’ వాయిస్‌ను పోలినట్టుగా ఓ వ్యక్తితో కామెంట్ కూడా చెప్పించారు. ఇదంతా ఎందుకోసం..? ముందే చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్‌లు, ఆటగాళ్లు అంతా ఫేక్ అయినా.. ఇదంతా చేసింది మాత్రం బెట్టింగ్ కోసం. మన దేశం వాళ్లయితే ఆటగాళ్లను, మ్యాచ్‌ను ఇట్టే గుర్తుపట్టేస్తారు కాబట్టి.. రష్యాలో బెట్టింగ్‌లు నిర్వహించారు. దీనికి ప్లాన్ వేసింది కూడా రష్యాలోని పబ్‌లు, బార్లలో బెట్టింగ్‌లు నిర్వహించే ఆసిఫ్ మొహమ్మద్ అనే వ్యక్తి, ఆ పబ్‌లలో పనిచేసి తిరిగి వచ్చిన షోయబ్ దావ్డా అనే గుజరాతీ వ్యక్తి. వాళ్లు ఇక్కడ ఫేక్ ఐపీఎల్ నిర్వహిస్తూ.. నిజమైన మ్యాచ్ల్లా కలరింగ్ ఇస్తూ పందాలు కాశారు. వచ్చిన బెట్టింగ్‌లకు అనుగుణంగా.. మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టిస్తూ.. ఔట్ చేయిస్తూ.. కావాల్సిన టీమ్‌ను గెలిపించుకుంటూ.. డబ్బులు దండుకున్నారు. చిత్రమేంటంటే మొత్తం ఉన్నది 25 మందే. కానీ చాలా టీమ్‌లు ఆడినట్టుగా... వారికే వేర్వేరు టీమ్‌ల డ్రెస్‌లు వేయిస్తూ, మార్చుతూ ఆడుతున్నట్టుగా నటింపజేశారు. ఎలా బయటపడింది? తమ ఊరిలో పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతు న్నాయని మోలిపూర్ వాసులు చర్చించుకోవడం.. ఆ నోటా ఈ నోటా ఈ విషయం మెహ్సానా పోలీసులకు చేరడం జరిగిపోయింది. ఓ పల్లెటూరిలో, అదీ తమకు తెలియకుండా మ్యాచ్‌లు ఏమిటని పోలీసులు ఆరా తీయడంతో.. ఫేక్ ఐపీఎల్, బెట్టింగ్ దందా గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు షోయబ్ దావ్డా సహా నలుగురిని అరెస్టు చేసి కేసు పెట్టారు. ఇంతా చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్ కిట్లు, జనరేటర్లు, ఐదు వీడియో కెమెరాలు, లైట్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మైక్రోఫోన్లు, వాకీటాకీలన్నీ కలిపి విలువ అంతా నాలుగు లక్షలలోపే కావడం గమనార్హం. -
ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, కామారెడ్డి : బెట్టింగ్ కేసులో అవినీతి ఆరోపణలతో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన కామారెడ్డి పట్టణ ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పట్టణ సీఐ జగదీశ్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సీఐకి చెందిన లాకర్ నుంచి 34 లక్షల నగదు, తొమ్మిది లక్షల విలువైన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి సుజయ్ సైతం అరెస్ట్ అయ్యాడు. కామారెడ్డి పోలీసు శాఖను ఏసీబీ విచారణ పర్వం వారం రోజుల పాటు కుదిపేసింది. (కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు!) స్పెషల్’.. నిద్రలోకి! సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పోలీసు శాఖలో ‘ప్రత్యేక విభా గం’ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విధులు మరిచి సేద తీరుతున్నట్లే కనిపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ నిఘా వ్యవస్థ తరచూ విఫలమవుతోందా..? అవినీతి పోలీసుల సమాచార సేకరణలో అట్టర్ ఫ్లాప్ అవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గా లు. ఓ సీఐ స్థాయి అధికారి.. ఎస్సైలు, ఏఎస్సైలు.. క్షేత్ర స్థాయిలో ప్రతి రెండు, మూడు పోలీస్స్టేషన్లకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక విభాగం పోలీస్ బాస్‌లకు మూడోకన్ను లాంటిది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి కదలికలు, పాస్‌పోర్టులు, జాబ్ ఎంక్వైయిరీ వంటి విధులతో పాటు జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు పోలీసు బాస్‌లకు సమాచారం అందించే నిఘా వ్యవస్థ ఇది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్పెషల్ బ్రాంచ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. నిఘా పెట్టట్లేదా? పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలను ఈ విభాగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు విచ్చ లవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. సివిల్ తగాదాల్లో తలదూర్చి రూ.లక్షలు దండుకుంటున్నారు. స్టేషన్లనే సెటిల్మెంట్లకు అడ్డాలుగా చేసి, పెద్ద ఎత్తున వెనకేసుకుంటున్నారు. గుట్కా, మట్కా, ఇసుక, మొరం వంటి రెగ్యులర్ మామూళ్లతో పాటు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల నుంచి కాసులు దండుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ వల పన్ని పట్టుకుంటేనే ఈ అక్రమార్కుల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయే తప్ప.. పోలీసు శా ఖ అంతర్గత నిఘా వ్యవస్థ ద్వారా ఏ అధికారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. (కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) ఏసీబీ పట్టుకుంటేనే వెలుగులోకి.. అవినీతి నిరోధకశాఖ దృష్టి సారిస్తేనే అధికారుల అ వినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది. నెల క్రితం రియల్ ఎస్టేట్ ప్లాటు తగాదాలో తలదూర్చిన బోధన్ సీఐ రాకేశ్, ఎస్ఐ మొగులయ్య రూ.50 వేలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్‌ఫోన్‌ను లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు బాన్సువాడ సీఐ టాటాబాబు కూడా ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తాజాగా కామారెడ్డి సీఐ జగదీశ్ అవినీతి బా గోతం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పని చేసిన ఆయ న లాకర్లలో రూ.34 లక్షల నగదు, స్థిరాస్తుల పేప ర్లు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఏసీబీ వల పన్ని పట్టుకుంటేనే పోలీసు శాఖలోని అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయే తప్ప తమ శాఖ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరిస్తున్న అవినీతి అధికారులపై ఈ స్పెషల్ బ్రాంచ్ నిఘా కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు బాస్‌ల దృష్టికి తీసుకెళ్లడం లేదా..? విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల వ్యవహారాలను ఎస్బీ అధికారులు పోలీసు బాస్ దృష్టికి తీసుకెళ్లడం లేదా..? లేక ఎస్బీ ఎప్పటికప్పుడు ఇస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయా..? అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలతో ‘ఆదాయ’ మార్గాలున్న స్టేషన్లలో విధులు నిర్వరిస్తున్న ఈ అవినీతి అధికారుల పట్ల ఉక్కుపాదం మోపడంలో పోలీసు బాస్‌లు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. -
పోలీసుల్ని కుదిపేస్తున్న బెట్టింగ్ కేసు!
సాక్షి, కామారెడ్డి: ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. బెట్టింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. రెండు రోజుల నుంచి అతని ఇంట్లో సోదాలు చేస్తోంది. నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సీఐ సన్నిహితుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలను ఏసీబీ సేకరిస్తున్నట్టు సమాచారం. మామూళ్ల విషయంలో ఎస్సైలు, డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రతో పాటు కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. నిన్న రాత్రి నుంచి డీఎస్పీ కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. గత రాత్రి కామారెడ్డి డీఎస్పీని విచారించారు. ఇక మామూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్సైలలో ఒకరు సెలవులో ఉండగా.. మరొకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు తెలిపారు. (చదవండి: బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్
-
హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అతి పెద్ద ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. హైదరాబాద్‌లో రాజస్తాన్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేణ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల నుంచి రూ.16కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, ముంబై, ఢీల్లీ రాజస్థాన్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో ఈ ముఠా బెట్టింగ్‌కు పాల్పడుతోందని తెలిపారు. అరెస్టైన వారిలో గణేష్, సురేష్, పంకజ్, సత్తయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఐపీఎల్-2020 మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ ముఠా అని పోలీసులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటు చేసి గణేష్ బెట్టింగ్ నడుపుతున్నాడని తెలిపారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
జ్యోతిష్యం ముసుగులో బెట్టింగ్ రాకెట్!
పేరుకు జ్యోతిష్యుడు. కానీ నడిపేది మాత్రం బెట్టింగ్ రాకెట్. కొడుకుతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్న 75 ఏళ్ల జ్యోతిష్యుడిని ఆగ్నేయ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల ఆశ్రమం లోపల జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను కూడా పట్టుకుని, వారి నుంచి రూ. 15వేలు స్వాధీనం చేసుకున్నారు. రామ్ స్నేహిలాల్ (75) అనే వృద్ధ జ్యోతిష్యుడే ఈ రాకెట్ మొత్తానికి సూత్రధారి అని, అతడు తన కొడుకును కూడా ఈ వ్యవహారంలోకి దింపాడని పోలీసులు తెలిపారు. జ్యోతిష్య కేంద్రం ముసుగులోనే ఆయన ఈ రాకెట్ నడుపుతున్నారన్నారు. రామ్ స్నేహిలాల్కు అంగవైకల్యం కూడా ఉండటంతో.. పోలీసులు ఎప్పుడు సోదా చేసినా, తనకేమీ తెలియదని ఇన్నాళ్ల బట్టి తప్పించుకుని తిరిగేవాడు. ఇప్పటివరకు ఎప్పుడూ పోలీసులకు దొరకలేదు. కేవలం జ్యోతిష్యం చెప్పించుకోడానికి మాత్రమే ప్రజలు తనవద్దకు వస్తారని చెప్పేవాడు. లాల్ కొడుకు ఛోటేతో పాటు జూదం ఆడేందుకు వచ్చిన రామ్ సింగ్, రవీందర్, శ్యామ్‌లాల్ వర్మ అనే ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి తమ క్లయింట్లు, వాళ్ల బెట్టింగ్ వివరాలు రాసే పుస్తకాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లుగా తెలియకపోయినా, తాజాగా తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం పోలీసులు ఈ దాడి చేశారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లిన పోలీసులకు అక్కడ స్నేహిలాల్ ఇంటి బయట చాలామంది గుమిగూడి కనిపించారు. అక్కడ ఎందుకంత మంది ఉన్నారని ప్రశ్నించగా.. అంతా తన క్లయింట్లని బుకాయించాడు. లోపలకు వెళ్లి చూడగా మొత్తం బాగోతం బయటపడింది. -
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 13 మందిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఆరు ల్యాప్‌టాప్‌లు, మూడు టీవీలు, 36 సెల్ ఫోన్లు, 2 మౌత్ స్పీకర్లు, 4 లయన్ బాక్సులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బెట్టింగ్‌ల్లో హైదరాబాద్‌కు చెందిన సత్యప్రకాశ్ జిందాల్ అలియాస్ నిక్కూబాయ్ ప్రధాన నిందితుడు అని తెలిపారు. రాజస్థాన్ కేంద్రంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం సాగుతుందన్నారు. ఇంటర్నేషనల్ బెట్టింగ్ కూడా కొనసాగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారంలో రాజస్థాన్‌కు చెందిన ఆషును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పెద్దెఎత్తున క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని మహేందర్‌రెడ్డి చెప్పారు. -
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా పట్టివేత
రాజస్థాన్‌లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. అజ్మీర్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 68 సెల్ఫోన్లు, 2 టీవీలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లలో 3 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం ఉందని ఈ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఐపీఎల్ బెట్టింగు వ్యవహారం చాలా దూరం వెళ్లింది. పలువురు ఆటగాళ్లు దీని పేరు చెప్పి విలువైన కెరీర్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా బెట్టింగు విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.