సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 100 మందికి విముక్తి | Sex racket busted in Mumbai | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 100 మందికి విముక్తి

Published Sat, Jul 19 2014 9:16 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 100 మందికి విముక్తి - Sakshi

సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 100 మందికి విముక్తి

ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టును నగర పోలీసులు శనివారం రట్టు చేశారు. విదేశాలకు రహస్యంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న100 మంది యువతులను పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం... ముంబై నగరంలోని ఫిష్ కంపెనీలో 100 మందికిపైగా బాలికలు బందీలుగా ఉన్నారని... సాధ్యమైనంత త్వరగా వారిని రక్షించాలని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

దాంతో పోలీసులు హుటాహుటిన ఫిష్ కంపెనీకి చేరుకుని... ఆ కంపెనీపై దాడులు నిర్వహించారు. అందులోభాగంగా బందీలుగా ఉన్న 100 మంది యువతులను పోలీసులు రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఫిష్ కంపెనీ యజమానులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement