ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జవహర్‌గనర్(హైదరాబాద్): వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జవహర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడలోని వాయుష్కినగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మల్కాజిగిరి ఎస్‌వోటీ, జవహర్‌నగర్ పోలీసుల సంయుక్త ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఘటనలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.3690 నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు
Comments
Please login to add a commentAdd a comment