అనంతపురం: రాయదుర్గంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.