inter state gang
-
HYD: నయాసాల్.. ‘మహా’ మాల్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మూఠా వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ శరత్ పవార్ వెల్లడించారు. ముగ్గురు నుంచి ఏడు లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు మహారాష్ట్ర నుండి తీసుకు వచ్చారని తెలిపారు. రూ.రెండు వేలకు ఒక గ్రాము కొని.. హైదరాబాద్‌లో ఏడువేలకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులు మహారాష్ట్రలో జ్యో అనే నైజీరియన్ వద్ద నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు. పరారీలో ఉన్న జ్యో కోసం పోలీసులు గాలిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై.. కొనేవారిపై పోలీసుల నిఘా ఉందని డీసీపీ శరత్ పవార్ అన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తామని, డ్రగ్స్ సరాఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మత్తు పదార్థాల వినియోగంలో పంజాబ్‌లా తెలంగాణ మారకుండా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులుదేనని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ అంతర్ రాష్ట్ర ముఠాలు విచ్చలవిడిగా నగరంలోకి డ్రగ్స్‌ను తీసుకురావటం గమనార్హం. చదవండి: TSRTC: ఉచిత ప్రయాణంపై ఓవరాక్షన్ -
వరంగల్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
-
13 ఖరీదైన వాహనాలు స్వాధీనం
అఫ్జల్‌గంజ్: ఖరీదైన వాహనాలను దొంగలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.17 లక్షల విలువైన ఏడు రాయల్ ఎన్ఫీల్డ్, ఒక యమహా, ఐదు బజాజ్ పల్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. నగరంతో పాటూ సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఖరీదైన వాహనాలు దొంగలిస్తూ అతి తక్కువ ధరకు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించామని, ఇద్దరు సభ్యులను అరెస్టు చేశామని, అందులో ఒకరు బాల నేరస్తుడు ఉన్నాడని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 13 వాహనాల్లో 2 అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి గురైనవి కాగా మిగతావి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ అయ్యాయి. -
‘దొంగతనాల’ ద్వారానే ఆ డ్రగ్స్ బయటకి..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వైరస్ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి యాంటీ వైరల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక ముఠాలు రంగంలోకి దిగాయి. స్థానిక గ్యాంగ్స్‌తో పాటు అంతరాష్ట్ర ముఠాలు వ్యవస్థీకృతంగా దందా చేస్తున్నాయి. ప్రధానంగా రెమిడెసివీర్, ఆక్టెమ్రా, ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్ ఔషధాలు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉన్న కోవిడ్ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. ఈ గ్యాంగ్స్ రకరకాలుగా ఈ యాంటీ వైరస్ ఔషధాలను సంగ్రహిస్తున్నాయి. ప్రధానంగా ‘దొంగతనాల’ ద్వారానే ఈ డ్రగ్స్ బయటకు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది, ఫార్మసిస్టులు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆస్పత్రులకే విక్రయించాల్సి ఉన్నా... అడ్డదారిలో బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ గ్యాంగ్ రోగుల్ని ముంచుతోంది. కొందరు ఆస్పత్రి ఉద్యోగులు మెడికల్ షాపులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని కథ నడిపిస్తున్నారు. (యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ సీటీస్కాన్లో పాజిటివ్) సంగారెడ్డిలో ఉన్న హెటిరో, గోవా కేంద్రంగా పని చేస్తున్న సిప్లా సంస్థలు మాత్రమే ఈ యాంటీ వైరల్ ఔషధాలను తయారు చేస్తున్నాయి. హెటిరో సంస్థ తమ రెమిడెసిమీర్ ఇంజెక్షన్‌ను రూ.5400, సిప్లా సంస్థ తాము తయారు చేస్తున్న సిప్రెమీ ఇంజెక్షన్‌ను రూ. 4000కు విక్రయిస్తున్నాయి. వీటిని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కేవలం ఆస్పత్రులకు మాత్రమే అమ్మాల్సి ఉంది. అమెరికాలో తయారవుతున్న ఫాబి ఫ్లూ టాబ్లెట్స్ సైతం కోవిడ్ రోగులకు వినియోగిస్తున్నారు. ఇది ఒక్కో స్ట్రిప్ రూ. 3500కు విక్రయిస్తోంది. ఈ ఔషధాలను రోగులకు విక్రయించాలంటే భారీ తతంగమే ఉంటుంది. రోగి ఆధార్ కార్డు ప్రతి, కరోనా పాజిటివ్ రిపోర్ట్, వైద్యులు రాసిన చీటీలతో పాటు రోగి కన్సంట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ దాఖలు చేసిన తర్వాత రోగికి అసరమైన మేరకు ఈ ఔషధాలను అందిస్తున్నారు. వినియో గించగా మిగిలిన డోసుల్ని తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉన్నా అమలు కాదు. కొందరు రోగులకు సగం డోసులు ఇచ్చిన తర్వాత వారు కోలుకుంటూ ఉంటారు. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే ) మిగిలిన డోసుల్ని ఆయా ఆస్పత్రుల్లో పని చేసే ఉద్యోగులు, ఫార్మసిస్టులు చోరీ చేస్తున్నారు. ఔషధాలు వినియోగిస్తూ, అసలు వాడకుండానే రోగులు మరణిస్తే ఆ డ్రగ్స్‌ను స్వాహా చేసి మెడికల్ షాపుల ద్వారా లేదా దళారుల సహకారంతో అవసరమైన రోగులకు అమ్ముతున్నారు. రూ. 5,400 ఖరీదు చేసే రెమిడెసివీర్ గరిష్టంగా రూ. 40 వేలకు, రూ. 40 వేలు ఖరీదు చేసే ఆక్టెమ్రా రూ. లక్షకు, రూ. 3500 ఖరీదు చేసే ఫాబిఫ్లూ రూ. 5 వేలకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై ఇటు పోలీసులతో పాటు అటు ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ అధికారులు ఇలాంటి గ్యాంగ్స్‌పై నిఘా ముమ్మరం చేశాయి. ఫలితంగా గడిచిన పది రోజుల్లో ఐదు ముఠాలు చిక్కాయి. వీరిలో అత్యధికులు దవాఖానా ఉద్యోగులు, మెడికల్ షాపుల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు ఉండటం గమనార్హం. ఇటీవల చిక్కిన ‘డ్రగ్స్’ ముఠాలివీ.. ♦ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత మంగళవారం ఎనిమిది మంది సభ్యులతో కూడిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 35 లక్షల విలువైన యాంటీ వైరస్ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో నలుగురు ఔషధ విక్రయ రంగంలో ఉన్న వారే. ♦ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్టు చేసి రూ. 5.6 లక్షల విలువైన రెమిడెసిమీర్ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నదమ్ములైన ఈ ద్వయం చిలకలగూడ, రామ్గోపాల్పేటల్లో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ♦ పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి తొమ్మిది రెమిడెసిమీర్, ఒక సిప్రెమీ ఇంజెక్షన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిలో ఆరుగురు నగరంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారే. ♦ ఆదివారం తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. నగరంలోని ఓ మెడికల్ షాపు, మరో దవాఖానాలో పని చేస్తున్న వీళ్లు రెమిడెసివీర్ ఇంజెక్షన్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ♦ సోమవారం మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు రెమిడెసివీర్ ఇంజెక్షన్లు, ఫావిపిరవిర్ అనే మాత్రలను అధిక ధరలకు అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేశారు. కుషాయిగూడలోని ఓ మెడికల్ షాపు కేంద్రంగా ఈ దందా సాగుతోంది. -
రోడ్డుపై డబ్బులు పడేసి... ఆపై చోరీలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజల దృష్టిని మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ష్ర్ట దొంగలను హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షల 40వేల నగదు, నాలుగు బైకులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన ఎ1 కిరణ్, ఎ2 తులసింధర్‌లపై తమిళనాడు, కర్ణాటక రాష్ష్ర్టాల్లో గతంలోనూ 23 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిద్దరిని విచారించగా మరో ఎనిమిది కొత్త కేసులు బయటకు వచ్చాయని, అలాగే ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో చోరీలకు పాల్పడినట్లు తేలిందన్నారు. రోడ్డుపై కరెన్సీ పడేయడం, వాహనాలను పంక్చర్ చేసి ఆపై చోరీలకు పాల్పడడంలో వీరిద్దరు ఆరితేరారని పేర్కొన్నారు. కాగా గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వీరిద్దరు ఆ తర్వాత కూడా చోరీలకు పాల్పడినట్లు తెలిసిందనన్నారు. నగరంలో మరోసారి చోరికి పాల్పడుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని, ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. -
బ్లేడు పడితే..బ్యాగు తెగాల్సిందే
అదో దొంగల ముఠా. వారు బ్లేడు పడితే.. బ్యాగు తెగాల్సిందే..ఆ ముఠా సభ్యులు ఆర్టీసీ బస్టాండ్లలో కాపు కాస్తారు. బ్యాగుల్లో నగలు తీసుకెళుతున్న ప్రయాణికులను గుర్తించి వారి వెంటే బస్సు ఎక్కుతారు. ప్రయాణికులు ఏమరపాటుగా ఉన్న సమయంలో బ్యాగు కత్తిరించి నగలు తస్కరిస్తారు. ఆ తర్వాత దారి మధ్యలోనే బస్సు దిగిపోతారు. శ్రీశైలం టెంపుల్: ప్రయాణికుల ముసుగులో ఆర్టీసీ బస్సుల్లో చోరీకి పాల్పడే అంతర్జిల్లా ముఠా సభ్యురాలిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నుంచి 65 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం శ్రీశైలం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఆదినారాయణపురం గ్రామానికి చెందిన కావేటి ఆదినారాయణ, కావేటి అలివేలు, కావేటి వరలక్ష్మి, శివలీల, నాగమ్మ, ఏడుకొండలు, కర్రెద్దుల వంశీ(నాని) ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ప్రయాణికుల మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి ప్రయాణికుల బాగ్యులు కత్తిరించి నగలు, నగదు చోరీ చేసేవారు. ఈక్రమంలో వీరిపై జిల్లాలోని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, నందికొట్కూరులో నాలుగు కేసులు నమోదయ్యాయి. చోరీలు ఇలా.. ముఠాలో ఆదినారాయణ కీలకమైన వ్యక్తి. అక్కచెళ్లెల్లైన కావేటి అలివేలు, కావేటి వరలక్ష్మిని అతడు వివాహం చేసుకున్నాడు. వీరు ముగ్గురూ శివలీల, నాగమ్మ, ఏడుకొండలు, కర్రెద్దుల వంశీతో ముఠా కట్టారు. ఇందులో కర్రెద్దుల వంశీ తప్ప మిగతా వారంతా బస్సుల్లో చోరీలు చేసేవారు. కర్రెద్దుల వంశీ వీరు చోరీ చేసి తెచ్చిన బంగారాన్ని కరిగించి అమ్మేవాడు. అనంతరం వచ్చిన డబ్బును అందరూ కలిసి పంచుకునేవారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వీరు చీరాల, అద్దంకి, ఒంగోలు, కడప, మైదుకూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేశారు. పట్టుబడిందిలా.. ఏడాది క్రితం నందికొట్కూరుకు చెందిన శివరత్నమ్మ ఆర్టీసీ బస్సులో కర్నూలు నుంచి నందికొట్కూరుకు బయలుదేరింది. ఆమెను వెంటాడిన దొంగల ముఠా సభ్యులు ఆమె బ్యాగును కత్తిరించి అందులో ఉన్న 44 తులాల బంగారును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. దాదాపు 8 నెలలపాటు బృందం సభ్యులు మఫ్టీలో ఉంటూ ముఠా సభ్యుల కోసం గాలించారు. ఈక్రమంలో ముఠా సభ్యురాలైన కావేటి అలివేలు శనివారం నందికొట్కూరులోని బంగారు దుకాణాల ముందు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొత్తం 85 తులాల బంగారు నగలు చోరీ చేసినట్లు అంగీకరించింది. ఇందులో 30 తులాలు బంగారం తన వద్ద ఉండగా మరో 35 తులాల బంగారాన్ని చీరాలలో మణప్పురం గోల్డ్‌లోన్‌లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకుంది. ఒంగోలు సీసీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్ బాలుకు 10 తులాల బంగారు అమ్మినట్లు తెలియజేసింది. నిందితురాలి నుంచి రూ.16 లక్షల విలువైన 65 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దొంగబంగారం కొనుగోలు చేసిన ఒంగోలు సీసీఎస్ కానిస్టేబుల్‌పై విచారణ చేపడతామన్నారు. సిబ్బందికి రివార్డులు.. అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసిన నందికొట్కూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈసందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది ఏ ప్రసాద్ఆచారి, బషీర్బాషా ,ఐ శ్రీనివాసులు, సి నాగరాజు, నభీసొలేల్ల,ఏ ఖాజాలకు రివార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు ఎల్లమరాజు, కృష్ణయ్య, వెంకటరమణ, నందికొట్కూరు, మిడుతూరు, శ్రీశైలం ఎస్ఐలు చంద్రశేఖరరెడ్డి, సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
కరీంనగర్‌క్రైం : కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధిక ధరలున్న బియ్యాన్ని నమూనాగా చూపించి రేషన్‌బియ్యం అంటగడుతున్న ముఠాను సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ హెడ్‌క్వార్టర్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో సీఐలు మాధవి, కిరణ్ విలేకరులతో వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారుగూడెంకు చెందిన సుంకర కనకరావు(42), సోదా వెంకటేశ్వర్లు(35), నర్సింహరావుపేటకు చెందిన గోపిశెట్టి నాగేశ్వర్రావు(35) ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీటినే ఇంటివద్ద 25 కిలోల బస్తాల్లో నింపి ఊరూరా తిరుగుతూ సన్నబియ్యమని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సన్నబియ్యం వస్తుండడంతో జనం కూడా కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి చూసేలోగానే వారు అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా పలు జిల్లాల్లో పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఆయా ప్రాంతాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌కు చెందిన అజ్మీరా రాజు గత నెల 31న ఆటోలో వచ్చిన వీరి నుంచి సన్నబియ్యం మూడు క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి చూడగా రేషన్‌బియ్యంగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం తిరుమల్‌నగర్‌కు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.10,500, ఆటో, బియ్యంబస్తాలు, మెషిన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
రాయదుర్గంలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
అనంతపురం: రాయదుర్గంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లు సిమి ఉగ్రవాదులే
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో కాల్పులకు పాల్పడింది సిమి ఉగ్రవాదులేనని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా వీరిని నిర్ధారించినట్లు సమాచారం. ఈ దుండగులిద్దరూ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు వారి వేలిముద్రలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర పోలీసుల సమాచారం. వారు మరి కాసేపట్లో ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో ఉన్న తీవ్రవాదులుగా భావిస్తున్న వారి మృతదేహాలు పరిశీలించనున్నారు. మూడో ఉగ్రవాది కూడా నల్లగొండలోనే.. ఇక రైల్వే టికెట్ ఆధారంగా మూడో ఉగ్రవాది కూడా ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడు నల్లగొండ జిల్లాలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. తుంగతుర్తి మండలం కుక్కడంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఒకరిని స్థానికులు ప్రశ్నించారని, అతడు హిందీలో మాట్లాడుతూ కనిపించడంతో అతడిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వెంటనే అతడు వరంగల్ జిల్లా పెముప్పారం వైపు అతడు పరారయినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు కుక్కడం పరిసరాల్లో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
అర్వపల్లిలో వేగంగా కూంబింగ్
నల్లగొండ: అర్వపల్లిలో పోలీసులు తీవ్రంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో హతమైన ముష్కరుల విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకొని మరిన్ని అధారాలకోసం అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఇద్దరు ముష్కరులు హతమవ్వగా వారికి చెందిన ఒక రైల్వే టికెట్ మూడో వ్యక్తి ఉండొచ్చనే అనుమానానికి తావివ్వడంతో అతడు ఎవరై ఉంటారు? ఎక్కడ ఉన్నాడు అనే వివరాలకోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు. అర్వపల్లిలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అర్వపల్లి దర్గాలో ముష్కరులు తల దాచుకున్నారన్న సమాచారం తెలిసిందే. దీంతో వారికి ఎవరైనా సహాయం చేసి ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. అక్కడే మౌలానా అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, నిందితుల చిత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు పంపించాలని కూడా భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే పంచనామా పూర్తి చేసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన దుండగుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం ఓ నాలుగు రోజులపాటు అక్కడే ఉంచనున్నారు. వారి తరుపున ఎవరైనా వస్తే వారికి అప్పగించాలని, లేదంటే పోలీసులే వారిని ఖననం చేయాలని భావిస్తున్నారు. -
ఖేల్ ఖతం
సూర్యాపేట కాల్పుల దుండగులు హతం నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్కౌంటర్ యూపీకి చెందిన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తింపు ప్రాణాలకు తెగించి మరీ కాల్చి మట్టుపెట్టిన పోలీసులు ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజు తీవ్రంగా గాయపడ్డ ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య.. పరిస్థితి విషమం రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి గాయాలు.. కామినేనిలో చికిత్స సినీఫక్కీలో ఘటన, రెండున్నర గంటల చేజింగ్ తర్వాత ముష్కరులు హతం ముందు రెండుసార్లు ఎదురుపడ్డా ఆయుధాలు లేక చేతులెత్తేసిన పోలీసులు నలుగురు కానిస్టేబుళ్ల ధైర్యసాహసాలతో జానకీపురంలో ముగిసిన వేట సిమి’ ఉగ్రవాదులంటున్న పోలీస్ వర్గాలు.. ఇంకా గుర్తించలేదన్న డీజీపీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆపరేషన్ ‘సూర్యాపేట’ ముగిసింది. రెండు రోజులుగా సాగిన ‘ఖేల్’ ఖతమైంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ దుండగులు హతమయ్యారు. జిల్లాలోని మోత్కూరు మండలం జానకీపురం గ్రామ శివారులో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. వీరిని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తించారు. అలాగే సూర్యాపేట ఘటనలో ఎత్తుకెళ్లిన కార్బైన్ కూడా లభించడంతో బస్టాండ్‌లో కాల్పులు జరిపింది వీరేనని కూడా నిర్ధారణ అయింది. అయితే ఈ ఎన్కౌంటర్లో ఓ కానిస్టేబుల్ చనిపోయారు. ఆత్మకూర్(ఎం) పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నాగరాజు(28) ముష్కరుల బుల్లెట్లకు బలయ్యారు. ఆత్మకూర్(ఎం) స్టేషన్ ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి కూడా గాయపడ్డారు. సిద్ధయ్య శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. కాగా, సిద్ధయ్య భార్య ధరణి నిండుచూలాలు. భర్తను చూడటానికి వెళ్లగానే పురిటినొప్పులు రావడంతో ఆమెను కూడా శనివారం రాత్రి కామినేనిలోనే చేర్చారు. కాసేపటికి ఆమెకు బాబు పుట్టాడు. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముష్కరులు హతమైనా కానిస్టేబుల్ చనిపోవడం, ఎస్ఐ ప్రాణాపాయ స్థితిలో ఉండటం విషాదం. ఉదయం అర్వపల్లి నుంచి మొదలు... బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పరారవడం, వారికోసం పోలీస్ యంత్రాంగమంతా తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టడం తెలిసిందే. విస్తృతంగా తనిఖీలు జరుపుతుండడంతో దుండగులు నల్లగొండ జిల్లా దాటి వెళ్లలేకపోయారు. ఈ రెండు రోజులు ఎక్కడ తలదాచుకున్నారో తెలియకపోయినా శనివారం ఉదయం అకస్మాత్తుగా బయటకువచ్చారు. సూర్యాపేటకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లి దర్గా ప్రాంతంలో కనిపించారు. ఉదయం 6 గంటలప్పుడు అర్వపల్లిలోని ముదిరాజ్ కాలనీ మీదుగా సీతారాంపురంవైపు నడుచుకుంటూ వెళ్లారు. తమ వద్ద ఉన్న కార్బైన్‌ను దుప్పటిలో, నాటు తుపాకీని కవరులో పెట్టుకుని వెళుతున్న వీరిని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తుంగతుర్తి సీఐ గంగారాం ఓ ప్రైవేటు వాహనంలో గాలింపు చే పట్టారు. సీతారాంపురం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో దుండగులున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే సీఐ గంగారాం వారిపైకి కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పుల అనంతరం ఆయన తుపాకీ పేలలేదు. దాంతో దుండగులు ఎదురుకాల్పులకు దిగారు. ఇతర సిబ్బంది వద్ద ఆయుధాలు లేకపోవడంతో పోలీసులు సీతారాంపురంవైపు వెళ్లిపోయారు. దుండగులు కాలువ నుంచి బయటపడి మళ్లీ అర్వపల్లికి వచ్చారు. బస్టాండ్ సమీపంలో లింగయ్య అనే వ్యక్తిని ఆపి అతని బజాజ్ డిస్కవరీ బైక్ లాక్కుని తిరుమలగిరివైపు వెళ్లారు. నాగారం క్రాస్‌రోడ్డు వరకు ప్రయాణించి ఫణిగిరి స్టేజీ నుంచి ఈటూరు మీదుగా అనంతారం రోడ్డుపైకి చేరుకున్నారు. అక్కడ రోడ్డు పక్కన ఓ దుకాణంలో పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికి ఉదయం 7:30 అయింది. అప్పటికే సమాచారం అందుకున్న మోత్కూరు ఎస్ఐ పులిందర్భట్ సిబ్బందితో అనంతారం మీదుగా వెళ్తూ, పెట్రోల్ పోయించుకుంటున్న దుండగులను గుర్తించారు. అప్పటికే వారిని దాటిపోవడంతో పోలీసులు వాహనాన్ని ఆపి కిందకు దిగారు. తమవద్ద ఆయుధాలు లేకపోవడంతో కర్రలు, రాళ్లు పట్టుకుని గట్టిగా అరుస్తూ, గ్రామస్తులను ఇళ్లలోకి వెళ్లాలంటూ హెచ్చరించారు. అది చూసిన దుండగులు తమ ఆయుధాన్ని బయటకు తీసి భుజానికి తగిలించుకున్నారు. దాన్ని పోలీసులకు చూపుతూ మోత్కూరువైపు బైక్‌పై వెళ్లారు. మోత్కూరు పీఎస్‌కు చెందిన అనిల్, రమేశ్ ధైర్యంగా మరో వాహనంపై వారిని వెంబడించారు. ఆయుధాల్లేకపోయినా వారిని అనుసరించారు. అనంతారం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని చిర్రగూడూరు వరకు వెళ్లి దుండగులు కుడివైపుమళ్లారు. పోలీసులు గ్రామస్తులను పోగుచేసుకుని వారిని వెంబడించారు. మార్గంలో వాగు రావడం, ఇసుకలో బైక్ కదలకపోవడంతో దుండగులు దాన్ని వదిలి వాగులో దాక్కున్నారు. ఇద్దరు పోలీసులతో పాటు యువకులు రావడంతో వారిపై కాల్పులు జరిపారు. దాంతో అంతా చెట్ల చాటున దాక్కున్నారు. యువకులు తెచ్చిన ఓ వాహనంపై ముష్కరులిద్దరూ జానకీపురం రోడ్డెక్కారు. ఇక్కడే డెత్‌స్పాట్... జానకీపురం వైపునకు బైక్‌పై వెళుతున్న దుండగులు ఎదురుగా ఎడ్లబండి రావడంతో ఆగిపోయారు. ఆ బండి వెనుకనే ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య తన సిబ్బందితో కలిసి మరో వాహనంలో వస్తున్నారు. దగ్గరకు వచ్చేంతవరకు ఒకరినొకరు గుర్తించలేదు. అకస్మాత్తుగా పోలీసులు కనిపించడంతో దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. డ్రైవర్ సీటులో ఉన్న కానిస్టేబుల్ నాగరాజు నుదిటిలోకి బుల్లెట్ దిగడంతో అక్కడికక్కడే చనిపోయారు. ముందు సీటులో ఉన్న ఎస్ఐ సిద్ధయ్యకు పొట్ట, మెదడు భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వాహనం వద్దకొచ్చిన దుండగులు.. ఆయుధాలిస్తే వదిలేస్తామని హిందీలో చెప్పారు. వెనుక సీట్లో ఉన్న కానిస్టేబుల్ మధు ఆయుధాలిస్తున్నాం ఉండమని చెబుతూనే ఒక్కసారిగా తనవైపున్న డోర్‌తో ఇద్దరినీ గట్టిగా గుద్దాడు. వారు పక్కనున్న చెట్లలో పడిపోవడంతో ఒక్క ఉదుటున వారిపైకి దూకాడు. వారితో పెనుగులాడుతున్న సమయానికే పోలీసులు కేకలు వేశారు. వారి వాహనానికి 5 మీటర్ల దూరంలో రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి దిగి కాల్పులు ప్రారంభించారు. దుండగులు ఆయనను కూడా టార్గెట్ చేశారు. ఒక బుల్లెట్ ఆయన లాఠీని రాసుకుంటూ వెళ్లిపోయింది. మరో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు... సీఐ గన్‌మన్ జానకిరాం కార్బన్‌ను తీసుకుని దుండగులపై కాల్పులు జరిపాడు. ఎక్కడా వారికి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా సమయస్ఫూర్తితో కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడే చనిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మోత్కూరు కానిస్టేబుళ్లు అనిల్, రమేశ్.. దుండగులను వెంబడించడం, గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన ధైర్యాన్ని మధు ప్రదర్శించడం, వెంకటేశ్వర్లు సమయస్ఫూర్తితో తుపాకీ ఎక్కుపెట్టడంతో ఉదయం 8 గంటలకు పోలీసుల వేట ముగిసింది. తమవారిని పొట్టనబెట్టుకున్న దుండగులను పోలీసులు కసితీరా కాల్చిచంపారు. దుండగుల శరీరం నిండా బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం... నాగరాజు మృతదేహాన్ని, సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించారు. ఆయుధాలు లేకుండా ఆపరేషన్! ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. సాయుధులైన దుండగులను ఎదుర్కొనే ప్రణాళిక సరిగ్గా లేకపోవడంతో మరో పోలీసు ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. తుంగతుర్తి సీఐకి దుండగులు తారసపడిన సమయంలోనే ఇతర పోలీసుల దగ్గర ఆయుధాలున్నా, కనీసం సీఐ గన్‌మెన్ అందుబాటులో ఉన్నా ఎస్సారెస్పీ కాల్వలోనే దుండగులు హతమయ్యేవారు. అనంతారంలో మోత్కూరు పోలీసుల వద్ద ఆయుధాలు లేకే దుండగులు బతికిపోయారు. సూర్యాపేట ఘటన సమయంలో కూడా అనుమానితులను విచారించే సమయంలో పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలా ఆయుధాలు లేకుండా ఆపరేషన్‌లో పాల్గొనడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలికి డీజీపీ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన దుండగుల మృతదేహాలను పరిశీలించారు. ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఆధారాలను సేకరించింది. కాగా, దుండగులను ఇంకా గుర్తించలేదని డీజీపీ చెప్పారు. పాత నేరస్తుల ఫొటోల ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మృతదేహాల వద్ద ఆయుధాలతో పాటు బస్సు టికెట్లు మాత్రమే లభించాయన్నారు. ఇతర ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో వెంటనే గుర్తించలేకపోయామన్నారు. దీనిపై ఆదివారం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి.. భయమనేదే తెలియదన్నట్టు పేట్రేగిపోయిన ఇద్దరు దుండగులను హతమార్చడానికి పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. గ్రేహౌండ్స్‌లో పనిచేసిన కానిస్టేబుల్ మధు చూపించిన ధైర్యసాహసాలు పోలీసు శాఖ పరువు నిలబెట్టాయనే చెప్పాలి. అతనే ఆ సాహసం చేయకుంటే మళ్లీ దుండగులకు ఆయుధాలు అప్పగించడమో, అంతా చనిపోవడమో జరిగేది. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీని పేల్చడంలో 2 సెకన్లు ఆలస్యమైనా దుండగులు ఇంకో రౌండ్ కాల్పులు జరిపేవారని, అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులే టార్గెట్! రోడ్లపై కాలినడకన, వాహనంపై సంచరించిన దుండగులు తమ చేతిలో ఆయుధాలున్నా సామాన్య ప్రజలను మాత్రం ఏమీ చేయలేదు. కేవలం పోలీసులు ఎదురుపడ్డప్పుడు మాత్రం ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరు కిరాయి హంతకులా లేక ఉగ్రవాదులా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఉగ్రవాదులైతే ఇలా బైక్‌ల మీద తిరుగుతూ హల్చల్ చేయరనే చర్చ కూడా జరుగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ దుండగులకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని అంటున్నారు. వీరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురి ముఠాలోని సభ్యులని చెబుతున్నారు. -
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరిగిన రెండు దుర్ఘటనలపై ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో పోలీసులు మరణిస్తే పరిహారమిచ్చి తమ పని అయిపోయిందని ప్రభుత్వం అనుకొంటే సరిపోదన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. పోలీసు కుటుంబాలకు, గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కాల్పులు, ఇమాంపేట వద్ద గెయిల్ పరిశ్రమ గ్యాస్‌పైప్‌లైన్ లీకేజీలో ఇద్దరు మృతి సంఘటనలపై లోతైన అధ్యయ నం అవసరమన్నారు. పోలీసుల ధైర్య సాహసాలు అభినందించాల్సిందేనన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిం దని చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఉగ్రవాదులేనా..?
సాక్షి, హైదరాబాద్: జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో హతమైన ముష్కరులు ఉగ్రవాది అబు ఫైజల్ ముఠా సభ్యులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులతో పాటు నిఘావర్గాలు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. ముఖ కవళికల ఆధారంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన దుండగులను అబు ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన అస్లాం, జాకీర్‌గా ఒక నిర్ధారణకు వచ్చినా... పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలున్న అబు ఫైజల్ ముఠా... దేశంలో పలుచోట్ల బాంబు పేలుళ్లతో పాటు బ్యాంకు దోపిడీలకు పాల్పడింది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పిం చుకుని తిరుగుతున్న ఈ ఉగ్ర ముఠా సభ్యులు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నారు. -
పోలీసుల త్యాగం గొప్పది
కాల్పులు, ఎన్కౌంటర్ ఘటనలపై కేసీఆర్ స్పందన అమరవీరులుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం సాక్షి, హైదరాబాద్: దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసు కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేష్‌లది గొప్ప త్యాగమని సీఎం కేసీఆర్ కొనియాడారు. వీరు అమరవీరులుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సూర్యాపేటలో కాల్పులు, అనంతరం చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారని సీఎం అభినందించారు. ఈ రెండు ఘటనల్లో గాయపడిన సీఐలు మొగిలయ్య, బాల గంగిరెడ్డి, ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య, హోంగార్డు కిశోర్ అత్యంత సాహసోపేతంగా దుండగులతో పోరాడారని ప్రశంసించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులతో పాటు మోత్కూరు మండలం జానకీపురం వద్ద శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ ఘటనలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనల్లో మృతిచెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయిస్తామన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పోలీసులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
తీవ్రవాదుల హతం..
-
ఆ ముష్కరులు వీళ్లే
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో హతమైన ఇద్దరు తీవ్రవాదులతో పాటు వారి సహచరుల ఫోటోలు బహిర్గతమయ్యాయి. మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి 2013లో తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దులు సిమీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరిలో అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌లు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. వీరు కొద్ది రోజులు కిందటి వరకు నెల్లూరు జిల్లా తడని కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని నిఘా వర్గాలు ఇది వరకే రాష్ట్ర పోలీసులని హెచ్చరించాయి. 2014 మే లో జరిగిన చెన్నై రైల్వే స్టేషన్ బాంబు పేలుళ్లు, 2014 ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు దొంగతనం, మే 2014 లో ఉత్తర్ ప్రదేశ్ బిజ్నూర్ పేలుళ్లలో వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
తడలో ఉగ్రవాదుల షెల్టర్?
నల్లగొండ: పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన వ్యక్తులు గతంలో నెల్లూరు జిల్లా తడలో షెల్టర్ తీసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌లకు చెన్నై పేలుళ్లతో కూడా సంబధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఫోటోలను నెల్లూరు పోలీసులకు పంపి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉంది. సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు జనవరిలోనే హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘావర్గాలు అప్పుడే సమాచారం అందించాయి. దీంతో జనవరిలోనే ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు అప్పుడే తడ పోలీసులకు పంపారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దీంతో జనవరిలోనే శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిలో ఇద్దరు మరణించడం సంచలనం సృష్టించింది. -
యూపీ గ్యా౦గేనని అనుమాన౦ : డీజీపి
-
తీగ లాగుతుంటే..డొంక కదులుతోంది..
నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు దుండగుల నేర చరిత్ర ఒక్కొక్కటిగా బయటకు పడుతోంది. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌కు సిమీ ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో వీరి ఇరువురిపై అనేక కేసులు ఉన్నాయి. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ గ్యాంగ్‌లో అస్లాం, జాకీర్ హుస్సేన్ కీలకం. గతంలో మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి వీరిద్దరు పరారైనట్లు తెలుస్తోంది. కాగా, దుండగులు ఇద్దరిని ఇంకా ఉగ్రవాదులుగా గుర్తించలేదని, విచారణ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. వీరిద్దరి నేర చరిత్ర పరిశీలిస్తే.... ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అస్లం అయూబ్, జాకీర్ హుస్సే న్ 2007 కేరళలో ఉగ్రవాద సాయుధ శిబిరం నిర్వహించిన గ్యాంగ్ ఖండ్వా పోలీస్ స్టేషన్లో 2009, 2010 వీరిపై కేసులు నమోదు 2010లో భోపాల్‌లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీ చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డ అస్లాం మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్లతో సంబంధం 2013లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేల్చింది ఈ ముఠానే 2014 అక్టోంబర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడింది ఈ ముఠా సభ్యులే. -
దుండగులు షార్ప్ షూటర్లు..
నల్లగొండ: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురం వద్ద ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు దుండగులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని భువనగిరి డీఎస్పీ తెలిపారు. దుండగులు షార్ప్ షూటర్లని, గతంలోనే వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు చెప్పారు. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్ గా గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు. శనివారం ఉదయం పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ దుండగులు 'దుకాణ్ బంద్ కరో, అందర్ చలో జావ్' అంటూ అరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు దుండగుల వద్ద నుంచి రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఛేజింగ్ అనంతరం దుండగులను పోలీసులు హతమార్చినట్లు తెలుస్తోంది. వీరికి సిమీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఎవరా దుండగులు?
* సూర్యాపేట కాల్పుల కేసులో కనిపించని పురోగతి * నిందితుల కోసం * జల్లెడపడుతున్న పోలీసులు *యూపీ, ఒడిశాకు వెళ్లిన దర్యాప్తు బృందాలు *అంతర్రాష్ర్ట ముఠా * పనేనంటున్న అధికారులు * కూపీ లాగేందుకు ఇర్ఫాన్‌ను విచారించే అవకాశం సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల కేసు దర్యాప్తులో పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి సోదాలు జరుపుతున్న పోలీసులపై కాల్పులకు తెగబడి ఓ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును హతమార్చిన దుండగులను పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం తీవ్రంగా గాలిస్తోంది. ఆక్టోపస్ కమాండోలతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్(ఎస్ఐబీ), కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. అయితే ఇది అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పనేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోవడంతో దుండగులు ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతా ల్లో తలదాచుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు 2 బృందాలను ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పంపించారు. కాగా, సూర్యాపేట పోలీసులు కొన్ని రోజుల కింద అంతర్రాష్ట దోపిడీ ముఠా నాయకుడు ఇర్ఫాన్, అతని సహచరుడు అక్తర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు అక్కడి జైలులోనే రిమాండు ఖైదీలుగా ఉన్నారు. వీరి అరెస్టు తర్వాతే బస్టాండ్‌లో కాల్పుల ఘటన జరగడంతో ఇందులో ఇర్ఫాన్ ముఠా హస్తముందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్యాప్తు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇర్ఫాన్ ముఠాలో అందరూ వయసు మళ్లిన వారున్నారని, పోలీసులపై దాడి చేసే సామర్థ్యం వారికి లేదని అంటున్నారు. అయితే, అసలు నిందితులను గుర్తించేందుకు ఇర్ఫాన్ సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాల సమాచారాన్ని సేకరించేందుకు త్వరలో కోర్టు అనుమతితో ఇర్ఫాన్, అక్తర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జ్యోతిష్యుడు నాగరాజుపై కాల్పులు జరిపిన కిరాయి హంతక ముఠాకూ సూర్యాపేట కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ ఇచ్చే సమాచారంతో కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరూ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇర్ఫాన్ అరెస్టు తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి స్వస్థలం మీరట్(యూపీ)కు సీఐ మొగిలయ్య వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన కోలుకున్నాక కీలక సమాచారాన్ని వెల్లడించే అవకాశముంది. కాగా, ప్రస్తుతం స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సైతం సమాంతర దర్యాప్తు ప్రారంభించింది. ఎస్ఐబీ ఎస్పీ చంద్రశేఖర్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ను సందర్శించి ఘటన జరిగిన తీరును స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. త్వరలో ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాష్ర్ట ప్రభుత్వం అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సూర్యాపేట కాల్పుల నిందితులు ఎన్కౌంటర్
నల్గగొండ: సూర్యాపేట బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు హతమయ్యారు. శనివారం ఉదయం మోత్కూరు మండలం జానకీపురం శివారులో పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితులు అక్కడికక్కడే హతం కాగా రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా దుండగులు జరిపిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. గత మూడు రోజులుగా సూర్యాపేట కాల్పుల ఘటన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం దుండగులు పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను నుంచి తప్పించుకున్న వారు ఓ వ్యక్తిని బెదిరించి బైక్‌పై పరారయ్యారు. దాంతో పోలీసులు సినీ ఫక్కీలో దుండగులను ఛేజ్ చేసి హతమార్చారు. మృతులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులుగా నిర్థారించారు. -
8 మంది బందిపోటు ముఠా సభ్యులు అరెస్ట్
హైదరాబాద్: అంతరాష్ట్ర బందిపోటు ముఠా గుట్టును నాచారం పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 8 మంది సభ్యులను బోరబండలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షల విలువ చేసే కాపర్ లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో చేసిన నేరాలను పోలీసులు వారి నుంచి రాబడుతున్నారు. రాష్ట్రంలో జరిగిన పలు చోరీలతో వీరికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. -
శంషాబాద్‌లో భారీ దోపిడీ
-
శంషాబాద్‌లో భారీ దోపిడీ
శంషాబాద్ మండలం పెద గోల్కొండ వద్ద భారీదోపిడీ జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొమ్మిది మంది సభ్యులున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. నిద్రపోతున్నవాళ్లను లేపి, కుటుంబ పెద్దను బంధించి, కత్తులు చూపించి ఇంట్లోని నగలు, నగదు మొత్తం దోచుకెళ్లారు. నలుగురు దొంగలు బయటే కాపలా ఉండగా, మరో ఐదుగురు మాత్రం ముసుగులతో లోపలకు ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవాళ్లను కత్తులతో బెదిరించి, దాదాపు 50 తులాల వరకు బంగారం, వెండి తీసుకెళ్లారు. దాంతో పాటు ఇంట్లో ఉన్న బీరువాలు, కప్‌బోర్డులు కూడా పగలగొట్టి.. లోపలున్న దాదాపు 50 వేల రూపాయల నగదు కూడా ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న దోపిడీలు ఈ ప్రాంతవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. దొంగలు మారణాయుధాలు తీసుకుని రావడం, చంపుతామని బెదిరించడంతో బాధితులు ముందుగానే తమ వద్ద ఉన్న సొత్తు అంతటినీ అప్పగించేశారు. కొసమెరుపు: దొంగలు తాము తీసుకెళ్లిన బంగారం నిజమైనదో కాదో తెలుసుకోడానికి గీటురాళ్లు కూడా వెంట తెచ్చుకున్నారు. పెద గోల్కొండలోని ఇంటినుంచి తీసుకెళ్లిన నగల్లో ఓ వడ్డాణం బంగారంది కాదని తెలియడంతో వాళ్లు దాన్ని ఊరి శివార్లలో పారేసి వెళ్లిపోయారు!! -
పర్చూరులో నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులు అరెస్ట్
ప్రకాశం జిల్లా పర్చూరులో అంత రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు దొంగలను శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 సవర్ల బంగారం, కిలోన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగలను పర్చూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల తమదైన శైలీలో వారిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. -
పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా
పిచ్చాటూరు, న్యూస్‌లైన్: జిల్లాలో పలు చోరీ కేసులతో సంబంధం ఉన్న అంతర్రాష్ర్ట దొం గల వుుఠాను పిచ్చాటూరు ఎస్ఐ హ నువుంతప్ప ఆధ్వర్యంలోని పోలీ సు ల బృందం చాకచక్యంగా పట్టుకుం ది. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడులో వుురుగన్(22), ప్రభాకర్(29), తిరువుూర్తి(26), కేశవన్(19)ను సోమవారం పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వుంగళవారం పిచ్చాటూరు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వుంగళవారం సాయుంత్రానికి ఒకటిన్నర కిలో బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిసింది. దీని విలువ సువూరు రూ.45 లక్షలు ఉండవచ్చని అంచనా. పిచ్చాటూరు వుండలంలోని రావుగిరి, కీళపూడితో పాటు వరదయ్యుపాళెంలో శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసు, నిండ్ర, నగరి, పుత్తూరు, కేవీబీ పురం వుండలాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో వీరి హస్తం ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ పట్టుబడ్డ నలుగురు దొంగలున్న వుుఠాను వుంగళవారం ఉదయుం నుంచి సాయుంత్రం వరకు డీఎస్పీ అరీఫుల్లా అధ్వర్యంలో పుత్తూరు, నగరి, సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, శివభాస్కర్ రెడ్డి, వునోహరాచ్చారి పిచ్చాటూరు స్టేషన్లో విచారిస్తున్నారు. వీరితో పాటు పిచ్చాటూరు, నిండ్ర, నగరి, కేవీబీ పురం, వరదయ్యుపాళెం వుండలాల ఎస్ఐలు హనువుంతప్ప, సునీల్‌కువూర్, ఆదినారాయుణ రెడ్డి, నెట్టి కంఠయ్యు, వంశీధర్ కూడా ఉన్నారు. అరుుతే వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. ఎస్ఐ హనువుంతప్పను వివరణ కోరగా, రెండు రోజుల తర్వాత జిల్లా ఎస్పీ ఎదుట విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేస్తామన్నారు.