
స్వాధీనం చేసుకున్న వాహనాలను చూపుతున్న పోలీసులు
అఫ్జల్‌గంజ్: ఖరీదైన వాహనాలను దొంగలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.17 లక్షల విలువైన ఏడు రాయల్ ఎన్‌ఫీల్డ్, ఒక యమహా, ఐదు బజాజ్ పల్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం ఈస్ట్ జోన్ ఇన్‌చార్జి డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. నగరంతో పాటూ సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఖరీదైన వాహనాలు దొంగలిస్తూ అతి తక్కువ ధరకు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించామని,
ఇద్దరు సభ్యులను అరెస్టు చేశామని, అందులో ఒకరు బాల నేరస్తుడు ఉన్నాడని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 13 వాహనాల్లో 2 అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి గురైనవి కాగా మిగతావి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment