నల్లగొండ: నల్లగొండ జిల్లాలో కాల్పులకు పాల్పడింది సిమి ఉగ్రవాదులేనని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్గా వీరిని నిర్ధారించినట్లు సమాచారం. ఈ దుండగులిద్దరూ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు వారి వేలిముద్రలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర పోలీసుల సమాచారం. వారు మరి కాసేపట్లో ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో ఉన్న తీవ్రవాదులుగా భావిస్తున్న వారి మృతదేహాలు పరిశీలించనున్నారు.
మూడో ఉగ్రవాది కూడా నల్లగొండలోనే..
ఇక రైల్వే టికెట్ ఆధారంగా మూడో ఉగ్రవాది కూడా ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడు నల్లగొండ జిల్లాలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. తుంగతుర్తి మండలం కుక్కడంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఒకరిని స్థానికులు ప్రశ్నించారని, అతడు హిందీలో మాట్లాడుతూ కనిపించడంతో అతడిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వెంటనే అతడు వరంగల్ జిల్లా పెముప్పారం వైపు అతడు పరారయినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు కుక్కడం పరిసరాల్లో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
వాళ్లు సిమీ ఉగ్రవాదులే
Published Sun, Apr 5 2015 2:09 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
Advertisement