సాక్షి, హైదరాబాద్: జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో హతమైన ముష్కరులు ఉగ్రవాది అబు ఫైజల్ ముఠా సభ్యులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులతో పాటు నిఘావర్గాలు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. ముఖ కవళికల ఆధారంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దుండగులను అబు ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన అస్లాం, జాకీర్‌గా ఒక నిర్ధారణకు వచ్చినా... పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు.
నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలున్న అబు ఫైజల్ ముఠా... దేశంలో పలుచోట్ల బాంబు పేలుళ్లతో పాటు బ్యాంకు దోపిడీలకు పాల్పడింది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పిం చుకుని తిరుగుతున్న ఈ ఉగ్ర ముఠా సభ్యులు ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నారు.