(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మూఠా వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ శరత్ పవార్ వెల్లడించారు. ముగ్గురు నుంచి ఏడు లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు మహారాష్ట్ర నుండి తీసుకు వచ్చారని తెలిపారు. రూ.రెండు వేలకు ఒక గ్రాము కొని.. హైదరాబాద్‌లో ఏడువేలకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులు మహారాష్ట్రలో జ్యో అనే నైజీరియన్ వద్ద నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు. పరారీలో ఉన్న జ్యో కోసం పోలీసులు గాలిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై.. కొనేవారిపై పోలీసుల నిఘా ఉందని డీసీపీ శరత్ పవార్ అన్నారు.
తెలంగాణలో డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తామని, డ్రగ్స్ సరాఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మత్తు పదార్థాల వినియోగంలో పంజాబ్‌లా తెలంగాణ మారకుండా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులుదేనని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ అంతర్ రాష్ట్ర ముఠాలు విచ్చలవిడిగా నగరంలోకి డ్రగ్స్‌ను తీసుకురావటం గమనార్హం.
చదవండి: TSRTC: ఉచిత ప్రయాణంపై ఓవరాక్షన్
Comments
Please login to add a commentAdd a comment