సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల దృష్టిని మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ష్ర్ట దొంగలను హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షల 40వేల నగదు, నాలుగు బైకులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన ఎ1 కిరణ్, ఎ2 తులసింధర్‌లపై తమిళనాడు, కర్ణాటక రాష్ష్ర్టాల్లో గతంలోనూ 23 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
వీరిద్దరిని విచారించగా మరో ఎనిమిది కొత్త కేసులు బయటకు వచ్చాయని, అలాగే ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో చోరీలకు పాల్పడినట్లు తేలిందన్నారు. రోడ్డుపై కరెన్సీ పడేయడం, వాహనాలను పంక్చర్ చేసి ఆపై చోరీలకు పాల్పడడంలో వీరిద్దరు ఆరితేరారని పేర్కొన్నారు. కాగా గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వీరిద్దరు ఆ తర్వాత కూడా చోరీలకు పాల్పడినట్లు తెలిసిందనన్నారు. నగరంలో మరోసారి చోరికి పాల్పడుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని, ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment