anjanikumar
-
‘ఉడ్తా’ హైదరాబాద్.. సిటీ క్రైం రివ్యూ
సిటీలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు ప్రారంభించాం. వచ్చే ఏడాది జోనల్ స్థాయిలోనూ సైబర్‌క్రైమ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తాం. నగరంలో నివసిస్తున్న రోహింగ్యాలపై పూర్తి నిఘా ఉంచాం. న్యూ ఇయర్ వేడుకలపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఈ ఏడాది మొత్తం 109 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. రాజధానిలో మాదకద్రవ్యాల కేసులు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది సిటీలో 3 లక్షల 61 వేల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. ఇక 80 శాతం నేరాలు టాస్క్‌ఫోర్స్ టీమ్స్ వల్లే కొలిక్కి వచ్చాయి. – అంజనీకుమార్, సీపీ సాక్షి, హైదరాబాద్: నగరంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాల కారణంగా ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు జోనల్ స్థాయిలో సైబర్ క్రైమ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది వీటిని అమలులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సోమవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో నేర గణాంకాలను పోలీసు కమిషనర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నగరంలో న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం, ఇతర విభాగాలు, అధికారులతో సంప్రదింపులు జరిగినా అనుమతించడమా? నిషేధించడమా? అన్నది స్పష్టం చేస్తాం. సిటీలో ఉన్న రోహింగ్యాలపై పూర్తి నిఘా ఉందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ బారినపడి ప్రాణాలు వదిలిన సిటీ పోలీసుల కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని అంజనీకుమార్ అన్నారు. గణనీయమైన సేవలు అందించిన లేక్ పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యలకు యత్నించిన 377 మందిని కాపాడారని చెప్పారు. ఈ ఏడాది ఓ సైబర్ నేరగాడు, ఐదుగురు మోసగాళ్లు సహా మొత్తం 109 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ‘ఉడ్తా’ హైదరాబాద్.. రాజధానిలో మాదకద్రవ్యాల కేసులు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. వీటికి బానిసలుగా మారుతున్న వారిలో అత్యధికులు యువకులే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ నుంచి గంజాయి, ఉత్తరాది నుంచి ఇతర మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయి. డ్రంక్ డ్రైవింగ్ కేసులు ఇలా.. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో కొరడా ఝుళిపించలేకపోయారు. అయినప్పటికీ కేసులు వేలల్లో, జైలు శిక్షలు పడిన వాళ్లు వందల్లో ఉన్నారు. ‘ఫోర్స్’ చూపిన ‘టాస్క్’.. నగర పోలీసు కమిషనర్ పరిధిలో ఏ సంచలనాత్మక, కీలక నేరం జరిగినా వెంటనే రంగంలోకి దిగేది టాస్‌్కఫోర్స్ పోలీసులే. ఈ విభాగంలో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. నగరంలో నమోదవుతున్న కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలకు చెక్ పెట్టడంలో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. ‘పెద్ద’గానే పెట్టీ కేసులు.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బ్రేకెన్ విండో థియరీ అమలైంది. చిన్న నేరాలను నియంత్రిస్తూ పోతే.. పెద్దవి వాటంతట అవే తగ్గుతాయి అనేది దీని సారాంశం. ఈ విధానాన్ని సిటీలోనూ అమలు చేస్తూ ఈ–పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. న్యూసెన్స్, బహిరంగంగా మద్యం తాగడం, సమయానికి మించి దుకాణాలు తెరిచి ఉంచడం ఇలాంటి వాటిపై పెద్ద సంఖ్యలోనే రిజిస్టర్ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 2,68,361 నమోదయ్యాయి. సీసీ కెమెరాలు.. నేరాలు నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్న నగర పోలీసు విభాగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం, అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడం చేస్తోంది. ఫేషియర్ రికగ్నైజేషన్ సిస్టమ్ వంటి సాఫ్ట్వేర్స్ వాడుతూ అనుమానితులు, నిందితులతో పాటు మిస్సింగ్ పర్సన్స్‌ను గుర్తిస్తోంది. సిటీలో ఈ ఏడాది వరకు మొత్తం 3,61,787 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. సీసీఎస్ పరిధిలో.. నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటిది. దీని ఆ«దీనంలోనే సైబర్ క్రైమ్ ఠాణా, ఉమెన్ పోలీసుస్టేషన్ తదితరాలు ఉన్నాయి. వాటిలో నమోదైన కేసులు, దర్యాప్తు పూర్తయినవి ఇలా.. సీసీఎస్, సిట్‌ల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా.. 150 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. అలాగే ఉమెన్ పోలీసుస్టేషన్లో 673 రిజిస్టర్ కాగా.. 589 దర్యాప్తు పూర్తయ్యాయి. ఈ ఏడాది సైబర్ నేరాలే పెరిగాయి సిటీలో ఈ ఏడాది అన్ని రకాలైన నేరాలు తగ్గగా.. కేవలం సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. బ్యాంకు అధికారులుగా ఫోన్లు చేసి ఓటీపీలు తెలుసుకుని స్వాహా చేసే జామ్‌తార క్రైమ్ 50 శాతం వరకు ఉంటోంది. ఆ తర్వాత ఓఎల్ఎక్స్లో పోస్టుల ఆధారంగా జరిగే భరత్పూర్ క్రైమ్, ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కలర్ ప్రిడెక్షన్ అనే ఆన్లైన్ గేమ్ గుట్టురట్టు చేశాం. రెండు కేసులకు సంబంధించి రూ.1,600 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో ఓ చైనీయుడి సహా 14 మందిని అరెస్టు చేశాం. 107 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.80 కోట్లు ఫ్రీజ్ చేశాం. – షికా గోయల్, అదనపు సీపీ(నేరాలు) -
‘టాప్‌బాస్’లకు తప్పని బదిలీలు..?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యంగా మారింది. వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని పోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్‌చార్జ్‌ల నేతృత్వంలో కొనసాగుతుండగా మరి కొందరు అధికారులు పదోన్నతి పొంది బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ నెలాఖరుకు ఇంకొందరు రిటైర్ కానున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా ఏటా ఈ పండుగకు భారీ స్థాయిలో బందోబస్తు అవసరం కావడంతో ఆ ప్రభావం పోలీసు బదిలీలపై ఉండేది. ఈ ఏడాది అలా కాకపోవడంతో ట్రాన్స్‌ఫర్స్‌కు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితాలకు తుదిమెరుగులు దిద్దుతున్న ఉన్నతాధికారులు ఈ నెలాఖరు లోగా ప్రభుత్వానికి నివేదించి ఉత్తర్వులు జారీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదోన్నతి వచ్చి ఏడాది దాటినా... నగర పోలీసు చరిత్రలో గత ఏడాది ఓ అరుదైన ఘట్టం ఆవిష్క్రృతమైంది. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నగరంలోని మూడు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు అప్పట్లో ఏడుగురు ఉండేవారు. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పదోన్నతులు ఇవ్వడంతో పాటే బదిలీలు సాధ్యం కాలేదు. ఫలితంగా ప్రతి అధికారినీ వారు పని చేస్తున్న స్థానంలోనే పదోన్నతి పొందిన హోదాతో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాచకొండ జాయింట్ సీపీగా పని చేస్తున్న జి.సుధీర్‌బాబును మాత్రం అదే కమిషనరేట్‌కు అదనపు సీపీగా నియమించారు. మిగిలిన వారంతా పై హోదాలో కింది పోస్టుల్లో కింది పోస్టుల్లో కొనసాగాల్సి వచ్చింది. ఇలా, ఈ స్థాయిలో అధికారులు గతంలో ఎన్నడూ పని చేయకపోవడంతో ఈ అరుదైన అంశం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూపులు... పోలీసు కమిషనరేట్‌కు నేతృత్వం వహించే కమిషనర్ నుంచి పోలీసు స్టేషన్‌కు ఇన్చార్జ్గా ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వరకు నిర్ధిçష్ట హోదాలు ఉంటాయి. ఆ హోదా దాటి పదోన్నతి వచ్చినప్పుడు వారిని బదిలీ చేయడం అనివార్యం. అదనపు డీజీ ర్యాంకు అధికారి పోలీసు కమిషనర్‌గా ఉంటారు. సిటీ పోలీసు విభాగానికి ఆయనే బాస్ కాబట్టి అదనపు కమిషనర్లు అంతా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) ర్యాంకు వాళ్ళే ఉంటారు. గత ఏడాది ఐపీఎస్‌ల పదోన్నతి నేపథ్యంలో సిటీ కమిషనరేట్‌లో డీసీపీ నుంచి అదనపు సీపీ వరకు వివిధ హోదాల్లో ఉన్న ఆరుగురు అధికారులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీలు లేకుండా పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వచ్చింది. ఈ హోదాల్లో ఇలా జరగడం అదే తొలిసారి. నగర అదనపు సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా పని చేస్తున్న షికా గోయల్‌కు అదనపు డీజీగా పదోన్నతి వచ్చినా అక్కడే కొనసాగుతున్నారు. ఎస్పీ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీగా పని చేస్తున్న ఏఆర్ శ్రీనివాస్‌కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్, తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. వీరితో పాటు మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావుకు సీనియర్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఈ హోదాలో డీసీపీగానూ పని చేసే ఆస్కారం ఉండటంతో ఆ పోస్టులోనే కొనసాగుతూ ఇటీవలే డీఐజీగానూ పదోన్నతి పొందారు. నెలాఖరులో రిటైర్ అవుతున్న ఈయన మినహా మిగిలిన అధికారులు ఏడాదికి పైగా బదిలీలు కోసం ఎదురుచూస్తున్నారు. ‘టాప్‌బాస్’లకు తప్పని బదిలీలు..? భౌగోళికంగా ఒకటిగా ఉన్న రాజధానిలో పోలీసు పరంగా మూడు కమిషనరేట్లకు ఉన్నాయి. వీటిని ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్‌కు అదనపు డీజీ స్థాయిలో అంజనీకుమర్, సైబరాబాద్, రాచకొండలకు ఐజీ హోదాల్లో వీసీ సజ్జనార్, మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వం వహిస్తున్నారు. సాధారణంగా ఈ పోస్టులను రెండేళ్లను టెన్యూర్ పీరియడ్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఆ టైమ్ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా బదిలీలు తప్పవన్నది ప్రతి అధికారికీ తెలిసిన విషయమే. రాజధాని విషయానికి వస్తే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్‌లు ఆ పోస్టుల్లోకి వచ్చి రెండేళ్లు దాటింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు టెన్యూర్ పూర్తి కావడంతో పాటు ఆయనకు ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి వచ్చింది. దీంతో ఈ మూడు పోస్టుల్లోనూ మార్పు చేర్పులు తప్పవని వినిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న దక్షిణ మండల డీసీపీ, నగర సంయుక్త సీపీ (పరిపాలన) ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్థాయిల్లోనూ కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు భారీ బదిలీలతో మూడు కమిషనరేట్లలోనూ కొత్త టీమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రోడ్డుపై డబ్బులు పడేసి... ఆపై చోరీలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజల దృష్టిని మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ష్ర్ట దొంగలను హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షల 40వేల నగదు, నాలుగు బైకులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన ఎ1 కిరణ్, ఎ2 తులసింధర్‌లపై తమిళనాడు, కర్ణాటక రాష్ష్ర్టాల్లో గతంలోనూ 23 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిద్దరిని విచారించగా మరో ఎనిమిది కొత్త కేసులు బయటకు వచ్చాయని, అలాగే ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో చోరీలకు పాల్పడినట్లు తేలిందన్నారు. రోడ్డుపై కరెన్సీ పడేయడం, వాహనాలను పంక్చర్ చేసి ఆపై చోరీలకు పాల్పడడంలో వీరిద్దరు ఆరితేరారని పేర్కొన్నారు. కాగా గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వీరిద్దరు ఆ తర్వాత కూడా చోరీలకు పాల్పడినట్లు తెలిసిందనన్నారు. నగరంలో మరోసారి చోరికి పాల్పడుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని, ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. -
హుండీ దందా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి ముంబైకి రవాణా చేయాలని చూసిన హుండీ నగదును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడీని హవాలా అని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హర్షద్ భాయ్ పటేల్, ఉమేష్ బోథ్ పి.ఉమేష్ చంద్ర అండ్ కంపెనీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలోని ఆ సంస్థ ఆఫీస్‌లో గుజరాత్‌కు చెందిన విపుల్ కుమార్ పటేల్ మేనేజర్‌గా, శైలేష్ భాయ్, విపుల్, ఉపేంద్ర కుమార్ పటేల్, పటేల్ చేతన్‌కుమార్‌లు క్యాష్ ట్రాన్స్‌పోర్టర్స్‌గా, అర్జున్ లభూజీ కారు డ్రైవర్‌గా, రాజేష్ రమేశ్ భాయ్ పటేల్ పార్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈ దందాలో కమీషన్‌గా రూ.లక్షకు రూ.600 తీసుకుంటారు. పట్టుబడ్డారిలా.. ఇటీవల నగరంలో వసూలు చేసిన రూ.5 కోట్లను ముంబై కార్యాలయానికి తరలించాల్సిందిగా వీరికి ఆదేశాలు అందాయి. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి డబ్బు తీసుకున్న ఈ ఏడుగురూ రెండు కార్లలో ముం బైకి బయలుదేరారు. దీనిపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు బి.దుర్గారావు, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ముజఫర్ తమ బృందాలతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వల పన్నారు. ఆ మార్గంలో వచ్చిన కార్లను తనిఖీ చేసి రూ.5 కోట్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
దక్కన్ చరిత్రలో నగరానిది ప్రత్యేకస్థానం
హైదరాబాద్: దక్కన్ చరిత్ర ఎంతో ఘనమైందని, దక్షిణ భారత్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో జరిగిన 39వ సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్‌ను నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా 5,700 నగరాల్లో సర్వే చేయించగా మన రాజధాని నగరానికి 3వ స్థానం లభించడం గర్వకారణమన్నారు. మధ్యయుగాల నుంచి నేటి వరకు నగరంలో కొనసాగుతున్న రక్షణ చర్యలను సీపీ వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ ఆది నుంచి అగ్రభాగాన నిలిచిందనేందుకు 1847లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడమే నిదర్శనమన్నారు. ఓయూలో 32 సంవత్సరాల తర్వాత జరుగుతున్న హిస్టరీ కాంగ్రెస్‌లో చరిత్ర విభాగం హెడ్, ఎస్‌ఐహెచ్‌సీ లోకల్ కార్యదర్శి ప్రొఫెసర్ అర్జున్‌రావు స్వాగతోపన్యాసం చేశారు. ఓయూ చరిత్ర విభాగానికి వందేళ్లు పురస్కరించుకుని సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, గోవా, పాండిచ్చేరి తదితర దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే హిస్టరీ కాంగ్రెస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్రతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలన సంస్కరణలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం తదితర అంశాలపై సమగ్ర చర్చలు, పరిశోధనాపత్రాలను ప్రతినిధులు సమర్పించనున్నట్లు చెప్పారు. అతిథులు ఎస్‌ఐహెచ్‌సీ–2018 ప్రొసీడింగ్స్‌ను ఆవిష్కరించారు. దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 600 మంది పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొ.సోమసుందర్రావు మాట్లాడుతూ దక్షిణభారత దేశ చరిత్రలో భావితరాలకు ఉపయోగపడేలా యూనివర్సిటీల నుంచి మరిన్ని పరిశోధనలు రావాలన్నారు. వైస్ చాన్స్‌లర్ ప్రొ.రామచంద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొ.ఇందిర, డాక్టర్ అంజయ్య, డాక్టర్ లావణ్య, డాక్టర్ అరుణ, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.రవీందర్, ప్రొ.నాయుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
స్త్రీలోక సంచారం
చిన్నారులపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను నివారించే విషయమై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ‘ఇనఫ్ ఈజ్ ఇనఫ్’ (జరిగింది చాలు) అంటూ ఒక వర్క్‌షాప్ జరిగింది. ప్రభుత్వ టీచర్ల కోసం ‘షీ’ టీమ్స్, భరోసా సెంటర్లు నిర్వహించిన ఈ వర్క్‌షాపులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) శిఖా గోయెల్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. యు.ఎస్.లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల సోహా నాజ్ అనే మూడో తరగతి బాలిక, ఎవరి సహాయమూ తీసుకోకుండా తనకై తనే తన ఇంటి ముందు కేక్స్, మిల్క్‌షేక్స్, మింట్ గ్రోన్ (పుదీనా) అమ్మి సంపాదించిన 300 డాలర్లను (సుమారు 21 వేల రూపాయలు) హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురాలో ఉన్న ‘సానీ వెల్ఫేర్ ఫౌండేషన్’కు విరాళంగా అందజేసింది! తినేందుకు తిండే లేని నిరుపేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ధార్మిక సంస్థల వీడియోలను చూసి స్ఫూర్తి పొంది, కష్టపడి డబ్బు సంపాదించి సోహా నాజ్ పంపిన ఈ డబ్బుతో 21 బియ్యం బస్తాలు వచ్చాయని ఫౌండేషన్ ప్రకటించింది. వెనుకా ముందూ చూడకుండా బయోకాన్ కంపెనీ సి.ఎం.డి. కిరణ్ మజుందార్ షా ఆస్తిని జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) ను ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002’ ట్రిబ్యునల్ తప్పు పట్టింది. కిరణ్‌కు కనీస వివరణకు కూడా అవకాశం ఇవ్వకుండా.. బెంగళూరు కింగ్‌ఫిషర్ టవర్స్‌లో విజయ్ మాల్యా హౌసింగ్ ప్రాజెక్టు కింద కిరణ్ మజుందార్ షా 2012లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను ఇ.డి.జప్తు చేయడంపై విస్మయాన్ని వ్యక్తం చేసిన ట్రిబ్యునల్.. ఫ్లాట్‌ను జప్తు నుంచి విడిపించింది. తలకొరివి పెట్టేందుకు, ఇతర అంత్యక్రియల్ని నిర్వహించేందుకు, కనీసం చితిస్థలికి వచ్చేందుకు మహిళల్ని అనుమతించని హైందవ సంప్రదాయంలో.. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కర్మకాండల సందర్భంగా కాస్త పట్టు విడుపు కనిపించింది. వాజ్‌పేయి పెంపుడు కూతురు నమితా కౌల్ భట్టాచార్య ఆయన చితికి నిప్పు పెట్టడాన్ని.. మహిళలపై సమాజంలో ఉన్న నిషేధాలు క్రమంగా తొలిగిపోతున్నాయనడానికి ఒక సంకేతంగా సామాజిక పోకడల పరిశీలకులు పరిగణిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్లనే.. కేరళలో జలప్రళయం సంభవించిందని వ్యాఖ్యానించిన ఆర్.బి.ఐ. సలహాదారు, ఆర్.ఎస్.ఎస్. ఆర్థిక విభాగమైన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ కో కన్వీనర్ ఎస్.గురుమూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలోని విమర్శల వరదల్లో చిక్కుకున్నారు. ప్రకృతి విలయాలకు, మానవ నిర్ణయాలకు ముడిపెట్టి ప్రజల్లో లేనిపోని అనుమానాలను కలిగించడం ద్వారా స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం మంచిది కాదని ట్విట్టర్లో కొందరు ఆయనకు హితవు చెప్పారు. యు.ఎస్. ఆరిజోనా రాష్ట్రంలోని మెసా పట్టణంలో ‘బ్యానర్ డెజర్ట్ మెడికల్ సెంటర్’ ఐ.సి.యు.లో సేవలు అందిస్తున్న మొత్తం 16 మంది నర్సులూ గర్భిణులేనన్న విషయం అనుకోకుండా బయటికి వచ్చింది. ఫేస్బుక్ గ్రూపులో ఉన్న ఈ నర్సులందరూ ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతమైన విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు వీళ్లంతా కూడా గర్భిణులేననీ, వచ్చే అక్టోబర్–జనవరి నెలల మధ్య వీరు ప్రసవించబోతున్నారని.. వీరిలోనే ఒకరైన రోషల్ షర్మన్ పట్టలేని ఆనందంతో బహిర్గతం చేయడంతో ఈ ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సరో, లంగ్ క్యాన్సరో వైద్యులు నిర్థారించే క్రమంలోనే క్యాన్సర్‌కు చికిత్సను పొందుతూ 56 ఏళ్ల వయసులో 1974లో మరణించిన అమెరికన్ రచయిత్రి జాక్వెలీన్ సుసాన్ నూరవ జయంతి నేడు. 1918 ఆగస్టు 20న ఫిలడెల్ఫియాలో జన్మించిన సుసాన్ ‘వ్యాలీ ఆఫ్ ది డాల్స్’ (1966), ‘ది లవ్ మెషీన్ (1969), ‘వన్స్ ఈజ్ నాట్ ఇనఫ్’ (1973) పుస్తకాలతో విశేష పాఠకాదరణ పొందారు. 21 ఏళ్ల వయసులో జేమ్స్‌బాండ్ చిత్రం ‘డై అనదర్ డే’ (2002)తో సినీ రంగ ప్రవేశం చేసిన రోసామండ్ పైక్.. ఆ చిత్రంలోని బాండ్ గర్ల్ పాత్ర ఎంపిక కోసం అండర్వేర్ మినహా తన ఒంటి మీద బట్టలన్నీ విప్పమని అడిగారని, అందుకు తను తిర స్కరించినప్పటికీ చివరికి ఆ పాత్ర తననే వరించిందని ఇన్నేళ్ల మౌనం తర్వాత ఇప్పుడు బయటపడ్డారు! రెండు రోజుల క్రితం ‘అమెజాన్స్ ఆడిబుల్ సెషన్స్’కి వెళ్లినప్పుడు ఈ రహస్యోద్ఘాటన చేసిన రోసామండ్.. తన తిరస్కారానికి ముగ్ధులవడం వల్లనే ఆ పాత్రను తనకు ఇచ్చినట్లు ఆ తర్వాత నిర్మాతలు తనతో అన్నారని కూడా చెప్పారు. -
మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు
-
పోలీసులపై నమ్మకం పెంచండి
సిబ్బందికి కమిషనర్ హితబోధ సాక్షి, సిటీబ్యూరో: ‘సిఫారసు చేస్తేగాని మన పిల్లలు సైతం ఫిర్యాదు చేసేందుకు ఠాణా మెట్లు ఎక్కే పరిస్థితి లేదు....అలాంటప్పుడు సాధారణ ప్రజలు మనపై ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు. ఇక నుంచి మీ వ్యవహార శైలిని మార్చుకోండి...ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా పనిచేయండి’... అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. పేట్లబురుజులోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్’పై జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మనల్ని (పోలీసులను) అడిగేవారు ఎవరు లేరని, మనం ఏం చెప్తే అదే నడుస్తుందనే భావనను విడనాడాలని ఆయన సూచించారు. ‘నూటికి 98 శా తం మంది ఏనాడూ పోలీసు స్టేషన్‌కు రారు... ఎప్పుడు పోలీసులతో మాట్లాడరు...వారికి మనం ఎప్పుడు అన్యాయం చేసి ఉండం... అయినా మన గురించి వారికి మంచి అభిప్రాయం లేదు... మన వద్దకు వచ్చే కొద్ది మంది బాధితులకు కూడా మనం న్యాయం చేయకపోగా, వారిని దూషించడమే దీనికి కారణం. పన్నుల రూపంలో ప్రజలు కట్టే డబ్బులతోనే మనం జీతాలు తీసుకుంటున్నాం. వారికి మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీకు ఏ అవసరం వచ్చినా అండ గా మేం ఉంటాం. సదా మీ సేవలోనే ఉన్నాం.. అనే ప్రచారాన్ని చేపట్టాలి. వారిలో భరోసా పెంచడంతో పాటు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించండి’ అని కమిషనర్ అ న్నా రు. అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమా ర్, జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంగళవారం కూడా కొనసాగనుంది. కమిషనర్ సూచనలివీ.... ఠాణాకు వచ్చిన బాధితుడితో మర్యాదగా మాట్లాడం ఫిర్యాదు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేయడం మేం చెప్పిందే వేదం అనే పద్ధతి మార్చుకోవడం ఛార్జీషీట్ సకాలంలో వేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయడం బాధితుడు ఈరోజు ఠాణాకు వచ్చినా కేసు పురోగతి చెప్పడం ప్రజలకు ఆయా ఠాణా అధికారులు సెల్ నెంబర్లు ఇవ్వడం ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆదుకుంటామని ధైర్యం చెప్పడంతో పాటు నమ్మకం కలిగించడం పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు.., దర్యాప్తు చేయరనే ప్రచారాన్ని తిప్పికొట్టడం -
సిటీ కమిషనరేట్‌లో ఎలక్షన్ సెల్
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఇన్స్పెక్టర్ స్థాయి వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ మరో కీలక చర్య తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల విడుదలకు ముందే భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలకు ఆస్కారం లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల నుంచే పని ప్రారంభించిన ఈ విభాగానికి అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సంయుక్త పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి సైతం కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సెల్లో శాంతిభద్రతల విభాగం, ఎస్బీ సిబ్బందితో పాటు మినిస్టీరియల్ స్టాఫ్‌ను ఏర్పాటు చేశారు. షెడ్యూల్‌కు ముందు సంప్రదింపుల బాధ్యత... రాజధానిలో ఉన్న హైదరాబాద్ కమిషనరేట్‌ను ఎన్నికల కోణంలో అత్యంత కీలకమైంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ముందు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు అనేక అంశాలపై నగర పోలీసుల నుంచి నివేదికలు కోరుతుంది. కొన్ని సందర్భాల్లో పోలీసులే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి కొన్ని వివరణలు తీసుకుంటారు. ఇటీవల ఇన్స్పెక్టర్ల బదిలీల అంశంలో అదే జరిగింది. షెడ్యూల్ విడుదలయ్యే వరకు ఎలక్షన్ సెల్ ఈ విధులను నిర్వర్తిస్తుంది. వివరాల సేకరణ, నివేదికల తయారీ సంప్రదింపులు ఇవన్నీ ఎలక్షన్ సెల్ సారథ్యంలోనే జరుగుతున్నాయి. షెడ్యూల్ తర్వాతా కీలకభూమిక... ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా ఎలక్షన్ సెల్ ఆ ఘట్టాన్ని ప్రశాంతంగా, వివాదరహితంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు బేరీజు వేయడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి, అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండటానికి దీన్ని వినియోగించనున్నారు. కోడ్ అమలులో ఉన్నన్నాళ్లూ ప్రతి రోజూ ఓ డీఎస్ఆర్ (డెరుులీ సిట్యువేషన్ రిపోర్ట్) తయూరు చేసి కమిషనర్‌కు, అవసరమైతే ఎన్నికల సంఘానికి ఈ సెల్ పంపుతుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో అదనపు సీపీ అంజనీకుమార్ మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ విభాగం కొనసాగుతుంది. తనిఖీల కోసం ప్రణాళికలు... ఎన్నికల సందర్భంగా అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా, నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు నగర వ్యాప్తంగా నాకాబందీలు, సోదాలు విస్తృతంగా చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికోసం డీసీపీలతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలోకి దారితీసే మార్గాలతో పాటు శివార్లపై వీరు దృష్టి పెట్టనున్నారు. బందోబస్తు వ్యూహాల ఖరారు... ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బందోబస్తుకు అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వర్తిస్తారు. నగరంలోని ఐదు జోన్లలో సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికల విధుల నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం వంటి విధులు కూడా ఎన్నికల సెల్ నిర్వహిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధుల పనుల పర్యవేక్షణ, రాష్ట్ర, కేంద్ర పోలీసు విభాగాలతో సమన్వయం కోసం ఈ సెల్ పని చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సెల్‌కు ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు కేటాయించాలని భావిస్తున్నారు. -
నుమాయిష్‌కు పండగ కళ