
తీగ లాగుతుంటే..డొంక కదులుతోంది..
నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు దుండగుల నేర చరిత్ర ఒక్కొక్కటిగా బయటకు పడుతోంది. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్కు సిమీ ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో వీరి ఇరువురిపై అనేక కేసులు ఉన్నాయి. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ గ్యాంగ్లో అస్లాం, జాకీర్ హుస్సేన్ కీలకం. గతంలో మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి వీరిద్దరు పరారైనట్లు తెలుస్తోంది. కాగా, దుండగులు ఇద్దరిని ఇంకా ఉగ్రవాదులుగా గుర్తించలేదని, విచారణ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు.
వీరిద్దరి నేర చరిత్ర పరిశీలిస్తే....
- ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్లో అస్లం అయూబ్, జాకీర్ హుస్సే న్
- 2007 కేరళలో ఉగ్రవాద సాయుధ శిబిరం నిర్వహించిన గ్యాంగ్
- ఖండ్వా పోలీస్ స్టేషన్లో 2009, 2010 వీరిపై కేసులు నమోదు
- 2010లో భోపాల్లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీ
- చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డ అస్లాం
- మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్లతో సంబంధం
- 2013లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేల్చింది ఈ ముఠానే
- 2014 అక్టోంబర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడింది ఈ ముఠా సభ్యులే.