
ఆ ముష్కరులు వీళ్లే
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో హతమైన ఇద్దరు తీవ్రవాదులతో పాటు వారి సహచరుల ఫోటోలు బహిర్గతమయ్యాయి. మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి 2013లో తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దులు సిమీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరిలో అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్లు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు.
వీరు కొద్ది రోజులు కిందటి వరకు నెల్లూరు జిల్లా తడని కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని నిఘా వర్గాలు ఇది వరకే రాష్ట్ర పోలీసులని హెచ్చరించాయి. 2014 మే లో జరిగిన చెన్నై రైల్వే స్టేషన్ బాంబు పేలుళ్లు, 2014 ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు దొంగతనం, మే 2014 లో ఉత్తర్ ప్రదేశ్ బిజ్నూర్ పేలుళ్లలో వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.