
దుండగులు షార్ప్ షూటర్లు..
నల్లగొండ: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురం వద్ద ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు దుండగులు ఉత్తరప్రదేశ్కు చెందినవారని భువనగిరి డీఎస్పీ తెలిపారు. దుండగులు షార్ప్ షూటర్లని, గతంలోనే వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు చెప్పారు. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్ గా గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
శనివారం ఉదయం పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ దుండగులు 'దుకాణ్ బంద్ కరో, అందర్ చలో జావ్' అంటూ అరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు దుండగుల వద్ద నుంచి రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఛేజింగ్ అనంతరం దుండగులను పోలీసులు హతమార్చినట్లు తెలుస్తోంది. వీరికి సిమీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే.