హైదరాబాద్ : నలుగురు అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎయిర్ పోర్ట్లో ముఠాకు చెందిన నలుగురు సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 4.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అలాగే రూ.16 లక్షల నగదుతోపాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.