southzone police
-
పాతబస్తీలో బైక్‌రేస్..
హైదరబాద్సిటీ: పాతబస్తీలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్న 100 మందికి పైగా మైనర్లను సౌత్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ల తల్లిదండ్రులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. బుధవారం ఉదయం 9 గంటలకు కులుబ్ కుతుబ్‌షాహీ గ్రౌండ్స్‌లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మైనర్లకు బైక్‌లు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
-
అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : నలుగురు అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎయిర్ పోర్ట్‌లో ముఠాకు చెందిన నలుగురు సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 4.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.16 లక్షల నగదుతోపాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాతబస్తీలో బాల్య వివాహం అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో బాల్య వివాహాన్ని సౌతో జోన్ పోలీసులు అడ్డుకున్నారు. రెయిన్ బజార్లో బాల్య వివాహం జరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా బాలికను నిఖా చేసుకునేందుకు సిద్ధపడ్డ ఓ అరబ్ షేక్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. బాలికకు పోలీసులు విముక్తి కలిగించారు. కాగా నిఖా జరిపేందుకు మధ్యవర్తిత్వం నడిపిన బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత రెండు రోజుల క్రితం ఛత్రీనాకలో ఓ బాల్య వివాహాన్ని కూడా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. -
పోలీసుల అదుపులో 158మంది పోకిరీలు
హైదరాబాద్ : హైదరాబాద్ లో సౌత్‌జోన్ పోలీసులు అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపై తిరుగుతున్న 158 మంది పోకిరీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి అయినా పనీ పాట లేకుండా రోడ్లపై సంచరిస్తున్న 158 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మంది మైనర్లు ఉన్నారు. యువకులతో పాటు వారి తల్లిదండ్రులకు బుధవారం ఉదయం 9.30 గంటలకు చార్మినార్‌లోని సన గార్డెన్ ఫంక్షన్ హాల్లో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. రంజాన్ సందర్భంగా నెల రోజుల నుంచి అర్ధరాత్రి తనిఖీలను పోలీసులు నిలిపివేయగా, మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
80 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్: బలపం పట్టి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన రేపటి యువత బలవంతపు వెట్టిచాకిరీలో మగ్గి తమ జీవితాన్ని అంధకారమయం చేసుకుంటోంది. బంగారంషాపుల్లో పనిచేస్తూ.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఇటువంటి 80 మంది బాలలను గురువారం సాయంత్రం పోలీసులు రక్షించారు. పాతబస్తీలోని చార్మినార్, హుస్సేని ఆలమ్ పరిధిలో గల బంగారు ఆభరణాలకు మెరుగులద్దే దుకాణాలలో తమ బాల్యాన్ని వృధా చేసుకుంటున్న బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. నగర సౌత్ జోన్ పోలీసులు జరిపిన ఈ దాడుల్లో సుమారు 80 మంది బాలకార్మికులను గుర్తించి వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతాల్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.