పోలీసుల అదుపులో 158మంది పోకిరీలు
హైదరాబాద్ : హైదరాబాద్ లో సౌత్జోన్ పోలీసులు అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపై తిరుగుతున్న 158 మంది పోకిరీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
అర్ధరాత్రి అయినా పనీ పాట లేకుండా రోడ్లపై సంచరిస్తున్న 158 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మంది మైనర్లు ఉన్నారు. యువకులతో పాటు వారి తల్లిదండ్రులకు బుధవారం ఉదయం 9.30 గంటలకు చార్మినార్‌లోని సన గార్డెన్ ఫంక్షన్ హాల్లో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. రంజాన్ సందర్భంగా నెల రోజుల నుంచి అర్ధరాత్రి తనిఖీలను పోలీసులు నిలిపివేయగా, మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.