ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఊరట దక్కలేదు.
కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయిల్ కోర్టు) తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించగా.. ఆ తీర్పుపై స్టే విధించింది.
ఈ సందర్భంగా సుదీర్ కుమార్ జైన్ ధర్మాసనం ..ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాల్ని ఎత్తి చూపింది. ఈడీ వాదనకు తగినంత సమయం ఇవ్వకపోవడం, మనీలాండరింగ్ నిరోధక చట్టంలో విడుదలకు సంబంధించిన షరతులను సరిగ్గా చర్చించడంలో విఫలమవడంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైంది
Delhi HC allows Enforcement Directorate's plea to stay the trial court's bail order for Delhi Chief Minister Arvind Kejriwal in the money laundering case linked to the alleged money laundering excise scam.
The bench of Justice Sudhir Kumar Jain stays the Arvind Kejriwal bail… pic.twitter.com/A4XL3FKdm1— ANI (@ANI) June 25, 2024
కేజ్రీవాల్‌కు బెయిల్.. అంతలోనే
అంతుకు ముందు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం నేరుగా ఉందని తెలిపేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ఆధారాల్ని అందించడంలో విఫలం కావడంతో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీం కోర్టులో రేపే విచారణ
అయితే ట్రయిల్ కోర్టు తీర్పును ఈడీ సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పు హేతుబద్దంగా లేదని ఈడీ తరుపు న్యాయవాది అడిషినల్ సోలిసిటర్ జర్నల్ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు వాదించారు. ట్రయల్ కోర్టు తమ వాదనల్ని వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని, వెంటనే ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించిన విధానాన్ని తప్పుబట్టింది.
కాగా, ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై రేపు (జూన్ 26న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment