హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెంచాయి. ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్‌ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ ఇప్పటికే లేఖ రాసింది. మనీలాండరింగ్ కోణంలోను శివబాలకృష్ణను ఈడీ విచారించనుంది. మరోవైపు శివబాలకృష్ణ బినామీ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నారు.
అధికారాన్ని అపయోగించుకుని హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ సుమారు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ. 250 కోట్లు ఆస్తులను బాలకృష్ణ కుడబెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ నాలుగు రెట్లు ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో శివబాలకృష్ణ, సోదరుడు నవీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్నారు.
ఇదీ చదవండి: HYD: ‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment