
డీకే శివకుమార్
సాక్షి, బెంగళూరు: మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన కర్ణాటక కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 3వ తేదీన ఢిల్లీలో సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీ తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. బుధవారం ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. పాసుపోర్టును అప్పజెప్పడంతో పాటు రూ.25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది.