
సాక్షి, బెంగళూరు: యాభై రోజులపాటు జైల్లో గడిపి తిరిగి బెంగళూరు చేరుకున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ మధ్య నగరంలోని కేపీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సిద్ధరామయ్య, పరమేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమానికి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment