DK Sivakumar
-
ముఖ్యమంత్రి పీఠం పదవీ రాజకీయం
ముఖ్యమంత్రి పదవి కోసం హస్తంలో మంత్రులు, సీనియర్లలో ఎక్కడా లేని ఆశ పుట్టుకొచ్చింది. సీఎం సిద్దరామయ్య ముడా స్థలాల కేసులో చిక్కుకోవడం, ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఓకే అనడంతో డోలాయమానంలో ఉన్నారు. దీంతో సమీకరణాలు మారవచ్చనే అంచనాలున్నాయి. ఇదే అదనుగా సీఎం కుర్చీకి తమకంటే అర్హులు ఎవరూ లేరంటూ అనేకమంది మంత్రులు ఘంటాపథంగా చాటుకోవడంతో పాటు హస్తిన యాత్రలు చేస్తున్నారు. ఓ రకంగా పీఠం కోసం కుస్తీకి తెరలేచింది.సాక్షి, బెంగళూరు: ఆలు లేదు, చూలు లేదు.. అన్నట్లు ముఖ్యమంత్రి కుర్చీ ఇంకా ఖాళీ కాలేదు.. అప్పుడే తానే సీఎంఅంటూ ఒక్కొక్కరూ ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇలా అధికార కాంగ్రెస్‌ను సీఎం కుర్చీ జ్వరం ఆవహించింది. ఇందుకోసం తెరవెనుక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పలువురు నేతలు బహిరంగంగా పదవి కోసం ప్రకటనలు చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.పాటిల్‌ల గొడవమంత్రులు ఎంబీ పాటిల్, శివానంద పాటిల్ మధ్య ముఖ్యమంత్రి స్థానం కోసం బహిరంగ వాగ్వాదం చోటు చేసుకుంది. తొలి నుంచి శివానంద పాటిల్ కాంగ్రెస్ పార్టీలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బంది కలుగజేస్తున్నారనే పేరుంది. 2023 ఎన్నికలకు ముందు తనకు ఎలాంటి హైకమాండ్ లేదని, తానే అధినాయకత్వం అని శివానంద పాటిల్ హంగామా చేశారు. ఎన్నికల తర్వాత మంత్రిమండలిలో ఈ ఇద్దరు నేతలకు పదవి కల్పించక తప్పని పరిస్థితి సిద్ధరామయ్యకు ఏర్పడింది. ఇప్పుడు సీఎం పదవిపై ఇద్దరూ కన్నేశారు.డీకేశి, ఇతర మంత్రులు..ఇక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆ పదవి కోసం ఆది నుంచి గట్టి పోటీలో ఉన్నారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత తానే సీఎం అని ఖరారు చేసుకున్నారు. మారిన పరిస్థితుల్లో తరచూ ఢిల్లీలో, రాహుల్‌గాంధీతో మాట్లాడుతూనే ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా మంత్రులు జమీర్ అహ్మద్, ఆర్వీ దేశ్‌పాండే తదితర సీనియర్లు తామేం తక్కువ కాదని, అదృష్టం వరిస్తే సీఎం కుర్చీ లభిస్తుందని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల పరిపాలనలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు విమర్శలున్నాయి.నాకూ సీఎం కావాలని ఉంది మంత్రి ఎం.బీ పాటిల్సాక్షి,బళ్లారి: సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న తనకు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని మంత్రి ఎం.బీ పాటిల్ అన్నారు. విజయపురలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం లభిస్తే మంచి పనులు చేయాలని ఉందని, భగవంతుని ఆశీస్సులు ఉంటే కచ్చితంగా పదవి వరిస్తుందన్నారు. డీకే శివకుమార్, పరమేశ్వర్ సమకాలికులమని, రేసులో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.ఢిల్లీకి వెళ్లకూడదా? సీఎం మార్పు జరగవచ్చనే సంకేతాలు వస్తున్న తరుణంలో 2–3 సార్లు మంత్రి సతీశ్ జార్కిహొళి ఢిల్లీలో హైకమాడ్ను కలుసుకుని తన పేరును కూడా పరిశీలించాలని మనవి చేశారు. హోంమంత్రి పరమేశ్వర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. మాకు ఎన్నో పనులుంటాయి, వెళ్లకూడదా? అని మీడియా ముందు చెప్పారు. దీనిని బట్టి సీఎం రేసులో తానూ ఉన్నట్లు తెలిపారు. మరికొందరు మంత్రులు లోలోపల విందు సమావేశాలు సాగిస్తూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీలో ౖపైపెకి అంతా సవ్యంగా సాగుతోందని అనిపిస్తున్నప్పటికీ లోలోపల పదవీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. -
పదో తరగతి స్టేట్ టాపర్లను సన్మానించిన డీకే శివకుమార్
బెంగళూరు: పదో తరగతిలో 625 మార్కులకు 625 మార్కులు సాధించిన 'అంకిత'ను నటుడు రిషబ్ శెట్టితో పాటు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా ప్రశంసించారు. స్టేట్ టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.10వ తరగతి పరీక్షలో 625/625 మార్కులు సాధించిన బాగల్కోట్కు చెందిన అంకితను మంగళవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సన్మానించారు. అంతే కాకుండా ఆ విద్యార్ధి ప్రతిభకు మెచ్చి ప్రోత్సాహక బహుమతిగా రూ.5 లక్షలు ప్రదానం చేశారు.అంకితను మాత్రమే కాకుండా మండ్య విద్యార్థి నవనీత్‌ను కూడా డీకే శివకుమార్ సత్కరించి.. ప్రోత్సాహక బహుమతిగా రూ.2 లక్షలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.#WATCH | Karnataka Deputy CM DK Shivakumar felicitates Ankitha, a student from Bagalkot who got 625/625 marks in the 10th exam and awarded Rs 5 lakhs.DK Shivakumar also felicitated Navneet, a student from Mandya, and also awarded Rs 2 lakhs. pic.twitter.com/mvpdJIfVng— ANI (@ANI) May 14, 2024 -
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నామినేషన్
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డీకే సురేష్ వెంట రామనగర జిల్లా ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తమ్ముడే ఈ డీకే సురేష్. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామిని 2013 ఉప ఎన్నికలో ఆయన ఓడించారు. మరోవైపు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి బావమరిది అయిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ సీఎన్ మంజునాథ్‌ను బీజేపీ-జేడీఎస్ కూటమి పోటీకి దింపింది. బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్న మంజునాథ్ 17 ఏళ్ల పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌కు సారథ్యం వహించి ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేశారు. -
జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోంది: డీకే శివకుమార్
బెంగళూరు రూరల్ బీజేపీ టికెట్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్‌ను పోటీకి దింపడం ద్వారా జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోందని అన్నారు. సీట్ల పంపకంపై జేడీ(ఎస్), బీజేపీ కూటమితో నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందిస్తూ.. నేను ఇది ఊహించాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జేడీ(ఎస్) ఇబ్బంది పడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన భాగస్వాములతో ఇలాగె చేస్తోందని అన్నారు. మాజీ సీఎం, బీజేపీ ఎంపీ డీవీ సదానంద గౌడను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే యోచనలో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రాజకీయ నాయకులకు పార్టీ టికెట్స్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, మరొక పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడం సహజం అన్నారు. ఆయనూరు మంజునాథ్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో జేడీఎస్ టికెట్‌పై పోటీ చేశారు. ముదిగెరెలో ఎంపీ కుమారస్వామి టికెట్ నిరాకరించడంతో జేడీ(ఎస్) టికెట్‌పై పోటీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను అంగీకరించి పార్టీలో చేరిన వారిని మేము తీసుకుంటాము అన్నారు. అయితే సదానందగౌడకు కాంగ్రెస్ టికెట్ ఇస్తారా అనే దానిపై తాను వ్యాఖ్యానించలేనని చెప్పారు. -
నీటి సంక్షోభంపై బీజేపీ విమర్శలు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కృష్ణరాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యాం నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తున్నారనే విషయం మీద ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. కావేరీ నదీ జలాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు విడుదల చేయబోమని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీటి విడుదలను ప్రారంభించలేదు. ఒకవేళ నీటిని విడుదల చేయాలన్నా దాని గమ్యాన్ని చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని శివకుమార్ వెల్లడించారు. నీటి సంక్షోభం తీవ్రతరమవుతున్న సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేసేంత మూర్ఖత్వం ఈ ప్రభుత్వంలో లేదని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో కేఆర్ఎస్ డ్యాం నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం జిల్లా కేంద్రమైన మండ్య పట్టణంలో రైత హితరక్షణ సమితి నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రైతులు, పౌరుల ప్రయోజనాల కంటే తమిళనాడులో దాని కూటమి భాగస్వామి 'డీఎంకే'కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ బీజేపీ కూడా విమర్శించింది. మలవల్లిలోని శివ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నింపేందుకు కేఆర్ఎస్ డ్యాం నుంచి కొంత నీటిని విడుదల చేశామని, అక్కడి నుంచి బెంగళూరుకు పంపింగ్ చేస్తామని శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేశామన్న వార్తలు పూర్తిగా ఆవాస్తవమని పేర్కొన్నారు. -
ఇంతటి తీవ్ర నీటి సంక్షోభాన్ని కర్ణాటక చూడలేదు: డీకే శివకుమార్
బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. గత మూడు-నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ సమయంలో తమిళనాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ నదీ జలాలను విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతకుముందు నీటి కొరత కొంత మేర ఉన్నప్పటికీ.. ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా మేము ఎప్పుడూ ప్రకటించలేదని విలేకర్లతో జరిగిన సమావేశంలో శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులో 13900 బోర్వెల్లలో 6900 బోర్వెల్లు పనికిరాకుండా పోయాయని పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కూడా తుమకూరు జిల్లా (746 గ్రామాలు) అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఇప్పటికే నీటి సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేసిందని శివకుమార్ చెప్పారు. నీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
డీకే శివకుమార్ భారీ ఆఫర్.. నో చెప్పిన హీరో శివ రాజ్‌కుమార్
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం కన్నడ స్టార్ హీరో అయిన శివ రాజ్‌కుమార్‌ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్ ప్లాన్‌కు శివన్న బ్రేకులు వేశాడు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్‌ను డీకే శివకుమార్ ఆఫర్ చేశారు. కర్ణాటకలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ టికెట్ ఇస్తామని శివన్నతో డీకే చెప్పారు. కానీ అందుకు శివరాజ్కుమారు నిరాకరించారు. తన ముందు ఐదారు సినిమా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని తెలిపారు. దీనికి సమాధానంగా డీకే కూడా ఇలా చెప్పారు... సినిమాలు ఎప్పుడైనా తీయవచ్చు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్రజలకు సేవ చేద్దాం. పార్లమెంటులో మీ లాంటి వారు ఉండాలి. కన్నడిగుల వాయిస్ వినిపించాలి.' అని కోరారు. అప్పటికీ కూడా శివరాజ్ కూమార్ అంగీకరించలేదు. అనంతరం శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'నేనెప్పటికీ రాజకీయాల్లోకి రాను. మా నాన్న మాకు తెరపై మాత్రమే నటించమని అడిగారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ చెప్పలేదు. ముఖానికి రంగులు వేసుకుని నటించి మీ అందరినీ మెప్పించడం మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్.. అక్కడే నా లైన్ ముగుస్తుంది. వెండితెరపై మా నటన మాత్రమే చూసి అభిమానులు మమ్మల్ని ఆధరించారు. అది చాలు మాకు .. రాజకీయాలు మాకొద్దు. వాటి కోసం ప్రత్యేకంగా మంచిపని చేసేవాళ్లు కూడా ఉన్నారు. అది వారి పని.. వెండితెరపై నటించడం మాత్రమే నా పని. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప (జనతాదళ్ JDS) కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. ఆయన కూడా మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఏనాడు పిలవలేదు. కానీ రాజకీయాలకు అతీతంగా మాత్రమే నా భార్య గీతకు అండగా నిలుస్తాను. తను రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలతో మమేకంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వరకు మాత్రమే నా పాత్ర ఉంటుంది.' అని శివన్న చెప్పాడు. దీంతో కొందరు శివన్న ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. (డీకే శివకుమార్‌తో గీత, ఆమె సోదరుడు మధు బంగారప్ప) గీత జనతాదళ్ అభ్యర్థిగా 2013లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గీత కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భగా ఆమె డీకే శివకుమార్ కాళ్లకు నమస్కరించారు. ఈ చర్యను శివరాజ్ కుమార్, రాజ్‌కుమార్ అభిమానులు అప్పట్లో ఖండించారు. గీత సోదరుడు అయిన మధు బంగారప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. -
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది. మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏకవాక్య తీర్మానానికి ఆమోదం సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్మున్షీ, అజయ్‌కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది. కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్‌కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. గెలిచిన వారికి అభినందనలు ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్‌భవన్‌లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్‌ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్ పార్క్ హయత్‌లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్’ మెసేజ్ కాదు.. ‘స్మార్ట్’ మెసేజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్.. ‘మిషన్ తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. ‘మిషన్ తెలంగాణ’పేరుతో నేటి కౌంటింగ్ ప్రక్రియ మొదలై ముగిసే దాకా అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెట్టింది. ఈ బాధ్యతను కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ‘ట్రబుల్ షూటర్’ డి.కె. శివకుమార్‌కు అప్పగించింది. ఆయనకు తోడుగా పలువురు కర్ణాటక మంత్రులు, కొందరు ఏఐసీసీ కీలక నేతలు ఆపరేషన్‌లో పాలుపంచుకోనున్నారు. కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు శనివారం మధ్యాహ్నానికే హైదరాబాద్ చేరుకోగా డి.కె.శివకుమార్ రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం రెండు ప్లాన్లను ఏఐసీసీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కీలక నేతలతో రాహుల్ మీటింగ్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పరిశీలకులు పాల్గొన్నారు. ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థులను ముందే హైదరాబాద్‌కు పిలిపించాలన్న కొందరి సూచనలను రాహుల్ తిరస్కరించినట్లు తెలిసింది. కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు లేకుంటే నష్టం జరుగుతుందని, ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయ ని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులను అక్కడే ఉంచాలని, ఫలితాలను బట్టి అభ్యర్థుల తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఏఐసీసీ పంపుతున్న కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షించాలని, ఏఐసీసీ పరిశీలకులతోపాటు జిల్లాల్లోని ముఖ్య నాయకులు అక్కడి పరిస్థితులను సమన్వయం చేసుకోవాలని... జిల్లాలవారీగా బాధ్యులను నియమించుకొని కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ద్విముఖ వ్యూహంతో ముందుకు.. ఈసారి అధికారం దక్కించుకునేందుకు రెండు వ్యూహాలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వస్తే ప్లాన్–ఏ, కొన్ని స్థానాలు తక్కువ పడే సందర్భంలో ప్లాన్–బీని అమలు చేయాలని నిర్ణయించింది. సంపూర్ణ మెజారిటీ సాధిస్తే అభ్యర్థులందరినీ హైదరాబాద్ పిలిపించి డి.కె.శివకుమార్ సమక్షంలో తొలుత సమావేశం ఏర్పాటు చేయనుంది. అనంతరం ఆయనతోపాటు టీపీసీసీ ముఖ్యులంతా కలసి ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో సీఎల్పీ సమావేశం తేదీని నిర్ణయించాలని, ఆ తర్వాత సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించాలని పార్టీ యోచిస్తోంది. ఒకవేళ హంగ్ పరిస్థితులు ఏర్పడి మెజారిటీకి కొన్ని స్థానాలు తక్కువగా వస్తే ప్లాన్–బీని అమలు చేయాలని, అప్పుడు వీలైనంత త్వరగా అభ్యర్థులందరినీ హైదరాబాద్‌కు పిలిపించి టీపీసీసీ ముఖ్య నేతలతో సహా అందరినీ బెంగళూరుకు తరలించాలని భావిస్తోంది. హంగ్ వస్తే ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంప్రదింపులు జరిపేందుకు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలనేది ఏఐసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే గెలుపు ధ్రువీకరణ పత్రాలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల ద్వారా తీసుకొనే ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం తమకు ఈసారి ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ముగిశాక అనుసరించాల్సిన వ్యూహాలను సమన్వయం చేసేందుకే ముఖ్య నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని, అది ఏఐసీసీ వ్యూహంలో భాగమేనని చెప్పారు. ఎంఐఎం అవసరం ఏర్పడితే? ఫలితాల్లో తమకు మ్యాజిక్ ఫిగర్ వస్తుందని ధీమాతో ఉన్న కాంగ్రెస్.. ప్రత్యామ్నాయ అవసరాలపైనా సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ అతిపెద్ద పారీ్టగా అవతరించి ఎంఐఎంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఏం చేయాలన్న దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తీసుకోవాలా వద్దా అనే దానిపైనా ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం మద్దతిచ్చేందుకు ముందుకొస్తే బయటి నుంచి ఆ పార్టీ మద్దతు తీసుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండబోదని, తెలంగాణలో రాజకీయ సుస్థిరత కోసం ఈ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అర్థం చేసుకుంటారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరిగినట్లు తెలుస్తోంది. -
Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో కుర్చీలాట!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్‌కు మద్దతు పలికారు. పోస్టు ఖాళీగా లేదు కదా! ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. -
రూ. 90 కోట్లకు పైగా నగదు సీజ్
బనశంకరి/ శివాజీనగర: గత పదిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.90 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రాబోయే లోకసభ ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఐటీ దాడులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదట 4వ తేదీన 30 చోట్లకు పైగా తనిఖీలు చేశారు. అందులో బంగారు వ్యాపారులు, మెడికల్ దుకాణాలు, ఆసుపత్రి యజమానులు, అకౌంటెంట్లతో పాటు బెంగళూరులో భారీ ధనవంతులు ఉన్నారు. 12వ తేదీన కాఫీ బోర్డు డైరెక్టర్, బంగారు దుకాణం యజమానుల ఇళ్లలో, అంగళ్లలో దాడులు జరిగాయి. 13వ తేదీన కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ఆర్.అంబికాపతి నివాసంలో సోదాల్లో రూ.42 కోట్లు దొరికాయి. 14వ తేదీ బిల్డర్ సంతోష్ కృష్ణప్ప ఫ్లాట్‌లో రూ.40 కోట్ల నగదు లభించింది. దీంతో ఇప్పటికి స్వాధీనమైన నగదు రూ.90 కోట్లను దాటింది. మంగళవారం విచారణకు వచ్చి నగదు వివరాలు చెప్పాలని కాంట్రాక్టర్ అంబికాపతి, భార్య అశ్వత్దమ్మ, కుమారులు ప్రదీప్, ప్రతాప్ లకు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కంగారులో కాంగ్రెస్, రహస్య భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని.. డిప్యూటీ డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ బెంగళూరులో సోమవారం భేటీ చేసి ప్రాముఖ్యమైన చర్చలు జరిపారు. వేణుగోపాల్ ఆకస్మికంగా నగరానికి వచ్చారు. ఆదివారం మైసూరు దసరా వేడుకల్లో పాల్గొన్న డీకేశి కూడా త్వరగా రాజధానికి వచ్చేశారు. ఇద్దరూ కలిసి ఖర్గేని ఆయన నివాసంలో కలవడం రాజకీయాల్లో పెను కుతూహలానికి కారణమైంది. ఐటీ దాడుల్లో లభిస్తున్న నగదు అధికార కాంగ్రెస్ నాయకులదేనని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు దాడి ప్రారంభించారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ నాయకుల్లో అసంతృప్తిని తగ్గించడానికి పదవులు పంపకాలను చేపట్టాలని, బోర్డులు, కార్పొరేషన్ల నియమకాల గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ పదవుల్లో పార్టీ ఎమ్మెల్యేలకు సగం ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. సీఎం సిద్దరామయ్య మైసూరు దసరా సంబరాల్లో ఉండడంతో ఆయన భేటీలో పాల్గొనలేదు. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట అభ్యర్థుల గురించి కూడా ఖర్గే, కేసీ, డీకే చర్చించారని సమాచారం. త్వరలోనే బోర్డు, కార్పొరేషన్లకు అధ్యక్షుల నియామకం జరగవచ్చు. భేటీ తరువాత కేసీ, డీకే దానిపై మీడియాతో మాట్లాడాకుండా వెళ్లిపోయారు. ఆ డబ్బుతో కాంగ్రెస్‌కు ఏం సంబంధం: సీఎం మైసూరు: మా ప్రభుత్వంపైన బీజేపీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు రాజకీయమైనవే తప్ప అందులో ఎలాంటి నిజం లేదు, ఇది రాజకీయం కుట్రలో భాగమని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఇళ్లలో కోట్ల రూపాయలు దొరికితే అది కాంగ్రెస్‌కు చెందినదని, ఇది పంచ రాష్ట్రాల ఎన్నికల కోసం సేకరించిందని బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ డబ్బుతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారని, త్వరలోని అన్నీ బయటికి వస్తాయని చెప్పారు. సీబీఐ విచారణకివ్వాలి: యడ్డి యశవంతపుర: బెంగళూరులోని కొందరు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో కోట్లాది రూపాయల నగదు లభించిన కేసును సీబీఐ, ఈడీ విచారణకు అప్పగించాలని బీజేపీ మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో మాట్లాడుతూ ఆ విచారణ ద్వారానే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. ఈ సొమ్ముల మూలం కనిపెట్టేందుకు తనిఖీ అవసరమన్నారు. కాగా రాష్ట్రంలో విద్యుత్ కోతతో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరెంటు కోతల వల్ల పంటలకు నీరివ్వలేక ఎండిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బోర్లకు, పంపుసెట్లకు విద్యుత్ ఇవ్వాలన్నారు. గ్యారంటీల పేర్లతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇంట్లో దండిగా డబ్బు ఉంటే యజమానికి సంతోషం. కానీ ఇప్పుడు అదే డబ్బును ఎక్కడ దాచుకోవాలో తెలియక ఐటీ సిటీ ధనవంతులు మథన పడుతున్నారు. ఏ క్షణంలో ఐటీ అధికారులు దూసుకొచ్చి నగదు పట్టుకెళతారోనన్న దిగులే ఇందుకు కారణం. కొన్నిరోజులుగా కన్నడనాట ఐటీ శాఖ జోరు మీదుంది. బెంగళూరులో ఇద్దరు బడా కాంట్రాక్టర్ల ఇళ్లలో కళ్లు చెదిరే మొత్తంలో డబ్బులు దొరికాయి. మరికొందరి ఇళ్లలో ఓ మోస్తరుగా లభించింది. చివరకు ఇది అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య యుద్ధంగా మారింది. ఆ డబ్బు మీదేనని పాలకులపై విపక్షాలు వేలు చూపిస్తుంటే, మాకు సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. -
కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం
బెంగళూరు: అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది. -
కర్ణాటకలో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో గ్యారంటీ కార్డు స్కీం అమలు తీరు గురించి తెలంగాణ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై బీజేపీసహా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పరిపాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించడం ద్వారా తాము ఇక్కడ అధికారంలోకి వస్తే హమీలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పర్యటనలో భాగంగా గ్యారంటీ కార్డు స్కీంల అమలుపై సెమినార్ నిర్వహిస్తామని, కర్ణాటకలో ఏం జరుగుతుందన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శివకుమార్ వివరిస్తారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ఆయన హైదరాబాద్‌కు వస్తారని తెలుస్తోంది. -
ఆయన బయోపిక్.. 'దేశీయ తలవైర్' పేరుతో
తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన నాయకుడు పశుమ్పొన్ ముత్తు రామలింగ దేవర్ జీవిత చరిత్ర 'దేశీయ తలైవర్' టైటిల్‌తో సినిమాగా తీస్తున్నారు. ఇందులో ముత్తు రామలింగ దేవర్ పాత్రలో జేఎం బషీర్ నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్. అరవింద్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) ఈ సినిమాను అక్టోబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి నిర్మాత ఏఎం.చౌదరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కర్ణాటకలోనూ విడుదల కానుంది. కాగా ఇటీవలే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌ను 'దేశీయ తలైవర్' హీరో, నిర్మాత ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తాము నిర్మిస్తున్న 'దేశీయ తలైవర్' గురించి డీకే శివకుమార్‌కు వివరించినట్లు, ఆయన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించిన జేఎం.బషీర్ ముత్తు రామలింగ దేవర్ మాదిరిగానే ఉన్నారని ప్రశంసించినట్లు చిత్రవర్గాలు ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కన్నడంలో రాష్ట్రీయ నేత పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) -
‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..!
కర్ణాటకలో అధికార పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హస్తిన వేదికగా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యేమార్గంగా చెరో రెండున్నరేళ్లు పదవిని పంచుకోవాలని అధిష్టానం ప్రతిపాదించినా సిద్ధరామయ్యకు తొలి చాన్సిచ్చేందుకు డీకే ససేమిరా అంటున్నారు. ‘‘అన్నదమ్ముల్లా సమానంగా పంచుకోవడానికి అదేమీ వారసత్వపు ఆస్తి కాదు! సీఎం పదవి. ప్రభుత్వ ఏర్పాటుతో ముడిపడ్డ అంశం. పంచుకునే సమస్యే లేదు’’ అని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. డీకే అభ్యంతరాల వెనక సహేతుకమైన కారణాలు లేకపోలేదు. కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు! ఛత్తీస్‌లో ‘చెయ్యి’చ్చిన భగెల్ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పార్టీలోనే ముఖ్య నేతల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా బెడిసికొట్టింది. అక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భూపేశ్ భగెల్ (62), త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్‌దేవ్ (70) సీఎం పదవి కోసం పట్టుబట్టారు. దాంతో అధిష్టానం ఇప్పుడు సిద్ధూ–డీకే ద్వయానికి ప్రతిపాదించిన ఫార్ములానే అమలు చేసింది. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండేలా రాజీ ఫార్ములా కుదిర్చింది. సింగ్‌దేవ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సరిపెట్టుకోగా తొలుత భగెల్ గద్దెనెక్కారు. తీరా 2021 జూలైలో రెండున్నరేళ్లూ ముగిశాక తప్పుకుని సింగ్‌దేవ్‌కు చాన్సిచ్చేందుకు ససేమిరా అన్నారు. ఇప్పటికీ సీఎంగా కొనసాగుతున్నారు. అగ్ర నేత రాహుల్‌గాంధీ రాష్ట్రాన్ని సందర్శించి అభివృద్ధి పనులన్నీ కళ్లారా చూశాక తనను ఉంచాలో, దించాలో డిసైడ్ చేస్తారని చెబుతూ రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. అధిష్టానం జోక్యం కోసం ఎదురు చూసి చిర్రెత్తుకొచ్చిన సింగ్‌దేవ్ ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేసినా లాభం లేకపోయింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భగెల్ను మార్చే ఉద్దేశం కూడా హస్తిన పెద్దలకు లేనట్టే కని్పస్తోంది! కర్ణాటకలోనే ఫెయిలైంది’... కర్ణాటకలోనే దాదాపు 20 ఏళ్ల క్రితం బీజేపీ, జేడీ(ఎస్) మధ్య సీఎం పదవి పంపకం కథ ఇలాగే అడ్డం తిరిగింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. బీజేపీకి 79, కాంగ్రెస్‌కు 65, జేడీ(ఎస్)కు 58 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ రెండేళ్లకే కాంగ్రెస్‌కు జేడీ(ఎస్) చెయ్యిచ్చింది. సంకీర్ణాన్ని కూలదోసి 2006 ఫిబ్రవరిలో బీజేపీతో జట్టు కట్టింది. చెరో 20 నెలలు సీఎం పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిరింది. తొలి చాన్సు దక్కించుకున్న జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఒప్పందం మేరకు 2007 అక్టోబర్‌లో గద్దె దిగేందుకు ససేమిరా అన్నారు. 4,5రోజుల హైడ్రామా తర్వాత ఆయన రాజీనామాతో రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. నెల తర్వా త జేడీ(ఎస్) బెట్టు సడలించడంతో బీజేపీ నేత యడియూరప్ప యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ శాఖల పంపిణీలో విభేదాలు రావడంతో యడ్డీ సర్కారుకు మద్దతివ్వను పొమ్మన్నారు కుమారస్వామి! అలా బీజేపీ–జేడీ(ఎస్) సంకీర్ణం కథ పూర్తిగా పట్టాలెక్కకుండానే కంచికి చేరింది! యూపీలోనూ అంతే 1996లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బీఎస్పీ ముందస్తు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. మొత్తం 424 స్థానాలకు గాను 174 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలవగా సమాజ్‌వాదీకి 110, బీఎస్పీకి 67, కాంగ్రెస్‌కు 33 స్థానాలు దక్కాయి. కొద్ది నెలల రాష్ట్రపతి పాలన అనంతరం కాంగ్రెస్‌కు బీఎస్పీ గుడ్‌బై చెప్పింది. ఆర్నెల్లకోసారి అధికారాన్ని మార్చుకునే ఒప్పందంతో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1997 మార్చిలో మాయావతి సీఎం అయ్యారు. సెప్టెంబర్‌లో ఆమె గద్దె దిగి బీజేపీ నేత కల్యాణ్‌సింగ్ సీఎం అయ్యారు. నెల రోజులకే బీఎస్పీ మద్దతు ఉపసంహరించడంతో సంకీర్ణం కథ ముగిసింది. అంతకుముందు 1995లోనూ బీజేపీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు ఐదు నెలలకే కుప్పకూలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక: సీఎం పీఠం చిచ్చు... కాంగ్రెస్‌లో ఆ నేతల మధ్య కోల్డ్ వార్?
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సిద్ధరామయ్య , పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే వారి మధ్య సీఎం కూర్చి కోసం కోల్డ్ వార్ మొదలైనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నువ్వా- నేనా కాంగ్రెస్‌లోని ఈ ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థి తామే అంటూ నేరుగా ప్రకటించకపోయినా సమయం వచ్చినప్పుడు పరోక్షంగా తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ఇప్పటికీ ఈ తరహా ఘటనలు జరిగినప్పటికీ తాజాగా డీకే శివకుమార్ ఈ అంశంలోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తెరపైకి తేవడం రాజకీయంగా చర్చ మొదలైంది. దీంతో పాటు 'దళిత సీఎం' పార్టీలో ముందు నుంచీ ఉంటున్నవారు, మధ్యలో వచ్చినవారు.. అనే అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా సిద్ధరామయ్య అవకాశాలను చెక్‌పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు. సోమవారం శృంగేరిలో శివకుమార్ విలేకరులతో ఖర్గే అంశంపై మాట్లాడుతూ.... 'ఆయన (ఖర్గే) మా సీనియర్ నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు.. ఆయన సీఎం పదవి కోరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే తన కోరిక. ఆయన సీనియర్ నాయకుడని, గతంలో అన్యాయం జరిగిందని కొన్ని గొంతులు వినిపిస్తున్నాయి. పార్టీ ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాలని.. అధిష్టానం ఏం చెబితే అది పాటిస్తామని, సిద్ధరామయ్య తదితరులు కూడా పార్టీకి కట్టుబడి ఉంటారని.. పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు. -
‘అధికారంలోకి వచ్చాక.. నీ సంగతి చెప్తా’.. కర్ణాటక డీజీపీకి స్ట్రాంగ్ వార్నింగ్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలో నేతల మధ్య మాటల యుద్దాలు మొదలయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిజీపీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డీకే శివకుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘ఈ డీజీపీ ‘నాలక్’ (పనికిరాని వాడు).. మన ప్రభుత్వం రానివ్వండి.. ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు’. ఇప్పటికే ఆయనని తొలగించాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ కూడా రాసింది. మొదట్లో డీజీపీ గౌరవనీయమైన వ్యక్తి అనుకున్నాను కానీ అతని తీరు చూస్తుంటే అలా అనిపించడం లేదన్నారు శివకుమార్. కాంగ్రెస్ నేతలపై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారని, బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా లేదని, పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వీటన్నింటికి సమాధానం చెబుతామన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడేందుకు అనైతికంగా పనిచేస్తున్న పోలీసు అధికారులందరిపైనా తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, తమ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఈడీ ముందుకు కేపీసీసీ చీఫ్ శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(60) సోమవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలంటూ గురువారం డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శివకుమార్ వైద్యులతో పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో 30 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. రూ.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై 2020లో సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన రెండో మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ప్రశ్నించింది. -
రాజకీయాలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు : రాజకీయాలపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సదాశివనగర్‌లోని తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో మోసం చేయటం అన్నది సర్వసాధారణ విషయం. నేను, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు ఇందుకు ఉదాహరణ. మేము బీజేపీ నుంచి ప్రతాప్ గౌడ పాటిల్‌ను పార్టీలో చేర్చుకున్నాము. వేరే పార్టీలోకి పోవటం వెనక్కు రావటం రాజకీయాల్లో మామూలే. పార్టీలోని ఒక్కోరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కానీ, వ్యక్తిగత అభిప్రాయాలకంటే పార్టీ అభిప్రాయాలు ఎంతో ముఖ్యం. పార్టీ వీడిన 17 మంది, అందులో మంత్రి పదవులు పొందిన వారు ఎవ్వరూ పార్టీని సంప్రదించలేదు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీలోకి వెళ్లిన 17 మంది మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చిన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకుని పార్టీలో చేరొచ్చు. అన్ని అప్లికేషన్లు పరిశీలించి పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ’’ అని పేర్కొన్నారు. -
రాసలీలల వీడియో: డీకే పేరెందుకు వస్తోంది?!
మైసూరు: మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడి కేసులో కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఆయన పేరును ప్రస్తావిస్తూ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని బాధిత యువతి కోరినందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీలోనే కుట్రలు : డీకే శివమొగ్గ: జార్కిహొళి వీడియోల కేసులో బాధిత యువతి చెప్పిన వివరాలు నా దృష్టికి వచ్చాయి, విచారణ జరుగుతున్నందున ఏమీ చెప్పలేను అని కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ అన్నారు. శివమొగ్గలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సీడీ వెనుక ఎవరున్నారో తెలియడం లేదన్నారు. బీజేపి ఎమ్మెల్యే యత్నాళ్ కూడా రాసలీల వీడియోల గురించి మాట్లాడారన్నారు. దీనిని బట్టి బీజేపీలోనే కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు సీడి కేసులో తమను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని, తగిన సమయంలో స్పందిస్తానని తెలిపారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే సీడీ కేసుపై సిద్దరామయ్య శివాజీనగర: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి విడుదల చేసిన కొత్త వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షనేత సిద్దరామయ్య స్పందించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... భద్రత కోరుతూ యువతి వీడియో విడుదల చేయటంపై అసెంబ్లీలో మాట్లాడుతానని, సీడీ కేసు వెనుక కాంగ్రెస్ నాయకులున్నారనే ఆరోపణపై అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య, దీనిపై కూడా తాను స్పందించనని, ఎవరు తప్పు చేసినా వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చదవండి: రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి -
ఘనంగా డీకే శివకుమార్ కూతురి పెళ్లి
యశవంతపుర: కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్య, ఎస్ఎం కృష్ణ మనవడు అమర్థ్య హెగ్డేల వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని వైట్ ఫీల్డ్‌లోని విలాసవంత హోటల్లో ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 14న(ఆదివారం) ఉదయం 9:30కు జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన వీరి వివాహానికి 800 మందికిపైగా బంధుమిత్రులు, సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా అమర్త్య హెగ్డే కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్ధార్థ-మాళవిక కృష్ణ దంపతుల కుమారుడు. ఆర్థిక కారణాలతో వీజీ సిద్ధార్థ 2019 జూలైలో ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో కెంపెగౌడ విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిరాడంబరంగా వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే కరోనా ప్రభావం కారణంగా నిశ్చితార్థానికి అతిథులను ఎక్కువగా పిలువలేదు. అమర్త్య హెగ్డే తండ్రి మరణానంతరం వారి సొంత వ్యాపారం చూసుకుంటున్నాడు. ఐశ్వర్య తనతండ్రి ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నది. -
డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు శనివారం సీబీఐ సమన్లు పంపింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సీబీఐ ఈ సమన్లు పంపింది. ఈ నెల 25న శివకుమార్ సీబీఐ ముందు హాజరుకానున్నారు. 23న తమ ముందు హాజరుకమ్మని సీబీఐ కోరిందని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉన్నందున 25న హాజరవుతానని తెలిపారు. కర్ణాటకలోని మస్కి, బసవకళ్యాణ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలను ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. గతనెల 5న శివకుమార్‌తో పాటు పలువురికి చెందిన నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ.57లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు, లభించినట్లు సీబీఐ తెలిపింది. -
ఐశ్వర్య, అమర్త్య ఎంగేజ్మెంట్
సాక్షి, బెంగళూరు దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ మనవడు అమర్త్య హెగ్డేతో కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య (22) నిశ్చితార్థ వేడుక గురువారం పూర్తయింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సన్నిహితులు పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో వీరి వివాహం చేసేందుకు నిశ్చయించారు. చిన్ననాటి స్నేహితులైన సిద్ధార్థ, శివకుమార్ వియ్యమందాలని గతంలోనే భావించారు. అయితే అనూహ్యంగా సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దీంతో వివాహాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు అడ్డొచ్చాయి. తాజాగా అన్ని అడ్డంకులను అధిగమించి అమర్త్య హెగ్డే - ఐశ్వర్య వివాహాన్ని ఖాయం చేసుకున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సిద్ధార్థ కుమారుడు తల్లి మాళవికతో కలిసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అటు ఐశ్వర్య డీకే శివకుమార్ స్థాపించిన ఇంజనీరింగ్ కళాశాల గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీని నిర్వహిస్తున్నారు. కాగా వీజీ సిద్దార్థ గత ఏడాది జూలై 2019 లో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. .@CMofKarnataka @BSYBJP attended @INCIndia @KPCCPresident @DKShivakumar's daughter's engagement ceremony. pic.twitter.com/T0vrMfWcsa — Imran Khan (@keypadguerilla) November 19, 2020 -
శివకుమార్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్‌కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్‌పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు. -
రాజకీయాల కోసం కాదు: శివకుమార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 114 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందించారు. విగ్రహ ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. స్థానికులకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. కాగా శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలోని హరొబెళలో పదెకరాల భూమి కొని అతి ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ప్రతిష్టిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా విగ్రహానికి పునాది వేశారు. అయితే ఆ విగ్రహాన్ని శివకుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం లేదని, అది సామాజిక అవసరాలకు ఉద్దేశించిందని రెవెన్యూశాఖ మంత్రి తెలిపారు. ఈ భూమిని శివకుమార్ కొనుగోలు చేయడంపై విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై శివకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో క్రీస్తు విగ్రహం లేనందున హరొబెళలో ఏసుక్రీస్తు విగ్రహం కావాలని స్థానికులు నన్ను కోరారు. నేను సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఇచ్చిన మాట ప్రకారం నేను నా పని చేశాను. ఇది రాజకీయాలకు లేదా అధికారం కోసం కాదు. జీవితంలో ఆత్మ సంతృప్తి కోసం కొన్ని పనులు చేయడానికి’ అని అన్నారు. ‘నేను గ్రామీణ నియోజకవర్గానికి చెందినవాడిని, అక్కడ ప్రజలు నాకు ప్రేమ, బలాన్ని ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను వందలాది దేవాలయాలను నిర్మించాను. మూడు ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలకు, వివిధ సంస్థలకు విరాళంగా ఇచ్చారు’ అని తెలిపారు.