బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు శనివారం సీబీఐ సమన్లు పంపింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సీబీఐ ఈ సమన్లు పంపింది. ఈ నెల 25న శివకుమార్ సీబీఐ ముందు హాజరుకానున్నారు. 23న తమ ముందు హాజరుకమ్మని సీబీఐ కోరిందని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉన్నందున 25న హాజరవుతానని తెలిపారు. కర్ణాటకలోని మస్కి, బసవకళ్యాణ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలను ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. గతనెల 5న శివకుమార్‌తో పాటు పలువురికి చెందిన నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ.57లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు, లభించినట్లు సీబీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment