CBI summons
-
అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు.. ఆదివారం విచారణకు రావాలని ఆదేశాలు
-
డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు శనివారం సీబీఐ సమన్లు పంపింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సీబీఐ ఈ సమన్లు పంపింది. ఈ నెల 25న శివకుమార్ సీబీఐ ముందు హాజరుకానున్నారు. 23న తమ ముందు హాజరుకమ్మని సీబీఐ కోరిందని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉన్నందున 25న హాజరవుతానని తెలిపారు. కర్ణాటకలోని మస్కి, బసవకళ్యాణ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలను ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. గతనెల 5న శివకుమార్‌తో పాటు పలువురికి చెందిన నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ.57లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు, లభించినట్లు సీబీఐ తెలిపింది. -
పీఎన్బీ స్కాంలో చందాకొచ్చర్, శిఖా శర్మలకు సమన్లు
ముంబై : పంజాబ్ నేషన్ బ్యాంకు భారీ కుంభకోణం కేసు సరికొత్త మలుపు తిరుగుతోంది. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంకులుగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులకు దర్యాప్తు సంస్థలు షాకిచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) సమన్లు జారీచేసింది. చందా కొచ్చర్తో పాటు యాక్సిస్ బ్యాంకు ఎండీ శిఖా శర్మకు కూడా నోటీసులు అందాయి. పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మోహుల్ చౌక్సిలకు సంబంధించే వీరికి నోటీసులు అందినట్టు తెలిసింది. అయితే నీరవ్‌మోదీ సంస్థలతో తమకేమీ సంబంధం లేదని, చౌక్సికి చెందిన గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం అందించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. అయితే ఎంత రుణం ఇచ్చామో ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించలేదు. యాక్సిస్ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూప్‌కు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. మరోవైపు గీతాంజలి గ్రూప్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ విపుల్ చిటిలియాను సీబీఐ అధికారులు ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. పీఎన్బీ స్కాంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నిస్తోంది. సీబీఐ ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు, యాక్సిస్ బ్యాంకు షేరు నష్టాల బాట పట్టాయి. -
రైల్వే మాజీ మంత్రికి సీబీఐ సమన్లు
కోల్ కతా: శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాయ్ కోల్ కతాకు వచ్చిన తర్వాత తమ ముందు హాజరుకావాలని సీబీఐ సమన్లు పంపింది. రెండుమూడు రోజుల్లో కోల్ కతాకు తిరిగి వెళతానని, తప్పనిసరిగా సీబీఐ అధికారులను కలుస్తానని రాయ్ ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. కాగా సీబీఐని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆరోపించారు.