రైల్వే మాజీ మంత్రికి సీబీఐ సమన్లు
కోల్ కతా: శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాయ్ కోల్ కతాకు వచ్చిన తర్వాత తమ ముందు హాజరుకావాలని సీబీఐ సమన్లు పంపింది.
రెండుమూడు రోజుల్లో కోల్ కతాకు తిరిగి వెళతానని, తప్పనిసరిగా సీబీఐ అధికారులను కలుస్తానని రాయ్ ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. కాగా సీబీఐని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆరోపించారు.