కోల్కతా: శారదా స్కాం కేసులో రైల్వే మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ కార్యదర్శి ముకుల్ రాయ్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణలో సీబీఐ పదేపదే అడిగిన ప్రశ్నలకు.. 'నేను ఎలాంటి నేరాలకు పాల్పడలేదు' అని మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు సమాచారం.
బెంగాల్కు చెందిన మంత్రి మదన్ మిత్రతో సహా తృణమూల్ పార్టీకి చెందిన నలుగురిపై శారదా స్కాం కేసులో ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ నేతలను సీబీఐ, ఈడీ బృందాలు విచారించాయి. కాగా ముకుల్ రాయ్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన అనుచరుడు.