యశవంతపుర: కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్య, ఎస్‌ఎం కృష్ణ మనవడు అమర్థ్య హెగ్డేల వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని వైట్ ఫీల్డ్‌లోని విలాసవంత హోటల్‌లో ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 14న(ఆదివారం) ఉదయం 9:30కు జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన వీరి వివాహానికి 800 మందికిపైగా బంధుమిత్రులు, సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
కాగా అమర్త్య హెగ్డే కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్ధార్థ-మాళవిక కృష్ణ దంపతుల కుమారుడు. ఆర్థిక కారణాలతో వీజీ సిద్ధార్థ 2019 జూలైలో ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో కెంపెగౌడ విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిరాడంబరంగా వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే కరోనా ప్రభావం కారణంగా నిశ్చితార్థానికి అతిథులను ఎక్కువగా పిలువలేదు. అమర్త్య హెగ్డే తండ్రి మరణానంతరం వారి సొంత వ్యాపారం చూసుకుంటున్నాడు. ఐశ్వర్య తనతండ్రి ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment