బెంగళూరు రూరల్ బీజేపీ టికెట్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్‌ను పోటీకి దింపడం ద్వారా జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోందని అన్నారు.
సీట్ల పంపకంపై జేడీ(ఎస్), బీజేపీ కూటమితో నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందిస్తూ.. నేను ఇది ఊహించాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జేడీ(ఎస్) ఇబ్బంది పడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన భాగస్వాములతో ఇలాగె చేస్తోందని అన్నారు.
మాజీ సీఎం, బీజేపీ ఎంపీ డీవీ సదానంద గౌడను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే యోచనలో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రాజకీయ నాయకులకు పార్టీ టికెట్స్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, మరొక పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడం సహజం అన్నారు.
ఆయనూరు మంజునాథ్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో జేడీఎస్ టికెట్‌పై పోటీ చేశారు. ముదిగెరెలో ఎంపీ కుమారస్వామి టికెట్ నిరాకరించడంతో జేడీ(ఎస్) టికెట్‌పై పోటీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను అంగీకరించి పార్టీలో చేరిన వారిని మేము తీసుకుంటాము అన్నారు. అయితే సదానందగౌడకు కాంగ్రెస్ టికెట్ ఇస్తారా అనే దానిపై తాను వ్యాఖ్యానించలేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment