
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు జరుపుతోంది. ఉత్తరాఖండ్, ఢిల్లీలోని మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ రెయిడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో బీజేపీలోనే ఉన్న హరక్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా హరక్‌సింగ్‌ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2022 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చింది.
ఇదీ చదవండి.. ప్రధాని సుడిగాలి పర్యటనలు.. ప్రసంగాల్లో దానిపైనే ఫోకస్ !